ETV Bharat / sports

ఛాంపియన్స్ ట్రోఫీ : ఎవరి బలం ఎంత?- ఎవరి ఛాన్స్​లు ఎలా ఉన్నాయి? - CHAMPIONS TROPHY 2025

ఛాంపియన్స్ ట్రోఫీ : సమరానికి 8 జట్లు సై- మరి ఎవరి బలాబలాలు ఎంత?

Champions Trophy 2025
Champions Trophy 2025 (Source : AFP)
author img

By ETV Bharat Sports Team

Published : Feb 19, 2025, 8:41 AM IST

Champions Trophy 2025 : ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఎడిషన్​కు సమయం ఆసన్నమైంది. బుధవారమే ఈ టోర్నీకి తెర లేవలనుంది. ఇది వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌- 8 టీమ్స్​ పాల్గొనే టోర్నీ, కాబట్టి ఏ జట్టునూ తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. అయితే ఎప్పటిలాగే టీమ్ఇండియా టైటిల్ ఫేవరెట్లలో ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఆయా జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దామా?

  1. భారత్ : స్వదేశంలో రీసెంట్​గా ఇంగ్లాండ్​తో వన్డే సిరీస్​ క్లీన్​స్వీప్ చేసిన టీమ్ఇండియా ఊపుమీదుంది. ఈ సిరీస్​తోనే సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్​ కోహ్లీ ఫామ్ అందుకోవడంతో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. గిల్, అయ్యర్, రాహుల్ నిలకడైన ప్రదర్శన కలిసొచ్చే అంశం. అయితే బుమ్రా లేడనే ఆందోళన తప్పా, టీమ్ఇండియా అన్ని రంగాల్లో బలంగానే కనిపిస్తోంది. ఇక 2023లో వన్డే వరల్డ్​కప్​ చేజారడంతో ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీనైనా దక్కించుకోవాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది.
  2. న్యూజిలాండ్‌ : ఉపఖండేతర జట్లలో భారీ అంచనాలున్నది న్యూజిలాండ్‌ జట్టుపైనే. ఐసీసీ టోర్నీల్లో కివీస్ ఎప్పుడూ నిలకడగా ఆడుతుంది. ఇటీవల ఆతిథ్య పాకిస్థాన్‌ను రెండుసార్లు ఓడించి ట్రై సిరీస్‌ గెలవడం ఆ జట్టు విశ్వాసాన్ని పెంచేదే. బ్యాటింగ్‌లో విలియమ్సన్, కాన్వే, ఫిలిప్స్, మిచెల్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో శాంట్నర్, బ్రాస్‌వెల్, హెన్రీ, ఒరూర్క్‌ నిలకడగా రాణిస్తున్నారు. కివీస్‌ ఇప్పుడున్న ఊపులో ఫైనల్‌ చేరగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
  3. ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియా ఎల్లప్పుడూ ఐసీసీ టోర్నీల్లో ఫేవరెట్ల లిస్ట్​లో కచ్చితంగా ఉంటుంది. కానీ, ఈసారి మాత్రం కంగారూలపై పెద్దగా అంచనాలు లేవు. కెప్టెన్‌ కమిన్స్‌తో పాటు హేజిల్‌వుడ్, మిచెల్‌ మార్ష్, స్టార్క్, స్టాయినిస్‌ అందుబాటులో లేక ఆసీస్‌ బలహీన పడింది. తాత్కాలిక కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు తోడు లబుషేన్, మ్యాక్స్‌వెల్, షార్ట్, ఇంగ్లిస్, అబాట్, స్పెన్సర్‌ జాన్సన్, ఎలిస్‌ లాంటి ప్రతిభావంతులతో కూడిన కంగారూ జట్టు టోర్నీలో ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.
  4. ఇంగ్లాండ్ :ఫార్మాట్‌ ఏదైనా ఇంగ్లాండ్‌ ప్రస్తుతం ప్రపంచ మేటి జట్లలో ఒకటి. అయితే భారత పర్యటనలో టీ20, వన్డే సిరీస్‌లు కోల్పోవడం ఇంగ్లాండ్‌ ఆత్మవిశ్వాసాన్ని కొంత దెబ్బ తీసేదే. అయినా సరే, సాల్ట్, డకెట్, బట్లర్, బ్రూక్, రూట్, లివింగ్‌స్టన్‌తో ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ పటిష్ఠంగా కనిపిస్తుంది. రషీద్‌ రూపంలో మేటి స్పిన్నర్‌ అందుబాటులో ఉన్నా అతడికి సహకరించే స్పిన్నర్లు లేరు. ఆర్చర్, సకిబ్‌ మహమూద్, వుడ్‌లతో కూడిన పేస్‌ విభాగం కూడా సరైన ఫామ్‌లో లేదు.
  5. సౌతాఫ్రికా : దురదృష్టాన్ని వెంటబెట్టుకుని ఐసీసీ టోర్నీలకు వస్తుందని పేరున్న సౌతాఫ్రికా ఈసారి కథ మార్చాలనుకుంటోంది. ఇటీవలే అరంగేట్రం చేసిన బ్రీట్జ్‌కే ఫామ్‌లో ఉన్నాడు. మార్‌క్రమ్, వాండర్‌డసెన్, క్లాసెన్, మిల్లర్‌ లాంటి సీనియర్లు బ్యాటింగ్‌లో ఆ జట్టుకు పెద్ద అండ. పేస్‌లో రబాడ మీదే జట్టు ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఎంగిడి ఫామ్‌లో లేడు. స్పిన్నర్లు కేశవ్‌ మహరాజ్, షంసి రాణించడం ఎంతో కీలకం.
  6. వాళ్లు కూడా : ఛాంపియన్స్‌ ట్రోఫీలో కొంచెం చిన్న జట్లని చెప్పుకోదగ్గవి బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్. బంగ్లాదేశ్, అఫ్గాన్‌ నాకౌట్‌ దశకు వెళ్లడం కష్టమే. అలా అని ఆ జట్లను తీసిపడేయలేం. మహ్మదుల్లా, మిరాజ్, ముస్తాఫిజుర్‌ లాంటి స్టార్లపై ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. ఇక అఫ్గానిస్థాన్‌కు రషీద్‌ ఖాన్, నూర్‌ అహ్మద్, నబి, కరోటెలతో కూడిన స్పిన్‌ విభాగం ప్రధాన బలం.

కాగా, బుధవారం పాకిస్థాన్- కివీస్ మ్యాచ్​తో టోర్నీ ప్రారంభం కానుంది. ఓటీటీలో జియోస్టార్​లో లైవ్​ స్ట్రీమింగ్ చూడవచ్చు. ఇక స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 బ్రాడ్​కాస్టింగ్ ఛానెల్‌లలో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో లైవ్ మ్యాచ్​లు వీక్షించవచ్చు.

మెగా జట్ల మహా సమరం- ఎవరిదో 'మినీ వరల్డ్​కప్​?'

ఛాంపియన్స్ ట్రోఫీలో హైయ్యెస్ట్ రన్స్ బాదిన బ్యాటర్స్ - రోహిత్, విరాట్ ఏ ప్లేస్​లో ఉన్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.