ETV Bharat / business

ఆగస్టులో వెయ్యి కోట్లు తగ్గిన జీఎస్​టీ వసూళ్లు

జీఎస్​టీ వసూళ్లు ఆగస్టు నెలలో భారీగా తగ్గాయి. కరోనా సంక్షోభం కారణంగా రూ. 86,449 కోట్లకు పడిపోయాయి.

GST COLLECTION
జీఎస్​టీ వసూళ్లు
author img

By

Published : Sep 1, 2020, 6:42 PM IST

Updated : Sep 1, 2020, 7:13 PM IST

కరోనా విజృంభణతో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఫలితంగా వస్తు సేవల పన్ను (జీఎస్​టీ) వసూళ్లు ఆగస్టులో భారీగా తగ్గాయి. ఈ ఏడాది జులైలో రూ.87,422 కోట్లుగా ఉన్న వసూళ్లు.. ఆగస్టులో రూ.86,449కు చేరాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

  • సీజీఎస్​టీ రూ. 15,906 కోట్లు,
  • ఎస్​జీఎస్​టీ రూ. 21,064 కోట్లు
  • ఐజీఎస్​టీ వసూలు రూ. 42,264 కోట్లు
  • సెస్ రూ. 7,215 కోట్లు

గతేడాదితో పోలిస్తే..

  • 2019 ఆగస్టులో జీఎస్టీ రూ. 98,202 కోట్లు వసూలైంది. అంటే, ప్రస్తుతం రూ.11,753 కోట్ల ఆదాయం తగ్గింది. గతేడాదితో పోలిస్తే 2020 ఆగస్టులో 88.03 శాతమే జీఎస్టీ వసూళ్లు జరిగాయి.
  • 2019 జులైలో రూ.90,917 కోట్ల వసూలయ్యాయి. దీనితో పోలిస్తే ఈ ఏడాదిలో జులైలో14.36 శాతం వసూళ్లు తగ్గాయి.
  • 2019 ఏప్రిల్-జూన్​తో పోలిస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీఎస్టీ సేకరణ 59% మాత్రమే.
    GST COLLECTION
    రెండేళ్లలో జీఎస్​టీ వసూళ్లు ఇలా..

6 రాష్ట్రాల్లోనే వృద్ధి..

  • 2019 ఆగస్టుతో పోలిస్తే 2020 ఆగస్టులో కేవలం 6 రాష్ట్రాల్లోనే జీఎస్​టీ వసూళ్లు పెరిగాయి. జమ్ముకశ్మీర్​లో 8 శాతం పెరిగి రూ.326 కోట్లకు చేరింది. ఇది 2019 ఆగస్టులో రూ.302 కోట్లుగా ఉంది.
  • ఉత్తరాఖండ్‌లో 7 శాతం పెరుగుదల నమోదైంది. రూ.941 నుంచి రూ.1006 కోట్లకు పెరిగింది.
  • రాజస్థాన్ 1 శాతం, ఉత్తర్​ప్రదేశ్​ 2 శాతం, నాగాలాండ్‌ 17 శాతం, ఛత్తీస్‌గఢ్​ 6 శాతం పెరుగుదల నమోదు చేశాయి.
  • మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జీఎస్టీ వసూళ్లు తగ్గాయి.

లాక్​డౌన్​ కారణంగా ఈ ఏడాది మే లో రూ.62,009 కోట్లు, ఏప్రిల్​లో అత్యల్పంగా రూ.32,294 కోట్ల పన్నులు మాత్రమే వసూలయ్యాయి.

ఇదీ చూడండి: అసలా.. వడ్డీయా..? రెండు ఐచ్ఛికాలపై కేంద్రం స్పష్టత

Last Updated : Sep 1, 2020, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.