ETV Bharat / business

బ్యాంకులకు మళ్లీ 'కొవిడ్' ముప్పు

కరోనా రెండో దశ విజృంభణతో దేశీయ బ్యాంకుల వృద్ధిపై ప్రతికూల ప్రభావం తప్పదని అంతర్జాతీయ రేటింగ్​ ఏజెన్సీ ఫిచ్‌ అంచనా వేసింది. చిన్న వ్యాపార సంస్థలు తీసుకున్న రుణాలు దీర్ఘకాలంలో మొండి బకాయిలుగా మారే ప్రమాదం ఉందని తెలిపింది. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచే ప్రధాన రాష్ట్రాల్లోనే 80 శాతం కేసులు నమోదవుతున్న నేపథ్యంలో దేశ జీడీపీ పుంజుకోడానికీ విఘాతం కలుగుతుందని అభిప్రాయపడింది.

bank operations may effect with corona again
బ్యాంకు వృద్ధి పుంజుకోడానికీ కరోనా విఘాతం : ఫిచ్‌
author img

By

Published : Apr 10, 2021, 10:56 AM IST

రెండో విడత కొవిడ్‌-19 వ్యాప్తితో భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ, బ్యాంకుల పురోగతికి ముప్పు పొంచి ఉందని ఫిచ్‌ రేటింగ్స్‌ అభిప్రాయపడింది. 2021లో భారత బ్యాంకింగ్‌ వ్యవస్థకు ఓ మోస్తరు ప్రతికూల పరిస్థితులే ఎదురు కావొచ్చని భావిస్తోంది. కొవిడ్‌ కేసుల ఉద్ధృతిని అదుపులోకి తెచ్చేందుకు తీసుకునే చర్యలతో వ్యాపారాలు, ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడొచ్చని పేర్కొంది. ఫిబ్రవరి మధ్యలో రోజుకు 9,300 చొప్పున కరోనా కేసులు నమోదవ్వగా, ఇప్పుడు ఆ సంఖ్య లక్షకు పైగా చేరడాన్ని ప్రస్తావించింది.

'ప్రభుత్వం అనుసరిస్తున్న సర్దుబాటు విధాన వైఖరి, వృద్ధిపై ఒత్తిడిని కొంత మేర పరిమితం చేయొచ్చు. కొవిడ్‌-19 అవరోధాలు తగ్గాలంటే అత్యధిక ప్రజలకు టీకాను త్వరగా, సమర్థంగా అందించడం కీలకమ'ని ఫిచ్‌ పేర్కొంది. 2022 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి భారత్‌ జీడీపీ వృద్ధి 12.8 శాతంగా నమోదుకావచ్చని ఫిచ్‌ పేర్కొంది. కొత్తగా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఏప్రిల్‌- జూన్‌లో వృద్ధి నెమ్మదించొచ్చనే అంశాన్ని పరిగణనలోకి తీసుకొనే, ఈ అంచనాను వెలువరించింది. అయితే కరోనా వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంటే వృద్ధి అంచనాలపై ప్రభావం పడుతుందని పేర్కొంది.

వ్యాపార సెంటిమెంట్‌పై ప్రభావం..

80 శాతం కొత్త కేసులు ఆరు ప్రధాన రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. బ్యాంకింగ్‌ రంగంలో 45 శాతం రుణాలు ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయని అంచనా. అందువల్ల ఈ రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలకు అవరోధాలు పెరిగితే వ్యాపార సెంటిమెంటు దెబ్బతినొచ్చు. అయితే గత సంవత్సరం మాదిరి కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించే అవకాశాలైతే ఉండకపోవచ్చని భావిస్తున్నామని ఫిచ్‌ రేటింగ్స్‌ తెలిపింది.

కొవిడ్‌-19 రెండో విడత వ్యాప్తితో వినియోగదారు, కార్పొరేట్‌ విశ్వాసంపైనా ప్రభావం పడితే, బ్యాంకుల కొత్త వ్యాపార ప్రణాళికలకు అవరోధం ఏర్పడుతుందని ఫిచ్‌ తెలిపింది. కొవిడ్‌-19 మొదట విడత, 2020 లాక్‌డౌన్‌ ఆంక్షల ప్రభావం బ్యాంకుల ఆర్థిక ఫలితాలపై ఇంకా పూర్తిగా పడలేదని, ఆస్తుల నాణ్యతపై ఆందోళనలు తొలగలేదని పేర్కొంది. 'సూక్ష్మ, చిన్న మధ్య తరహా సంస్థలు, రిటైల్‌ విభాగాల్లోని రుణాలు మొండి బకాయిలుగా మారే అవకాశాలున్నాయని భావిస్తున్నామ'ని రేటింగ్ సంస్థ‌ అభిప్రాయపడింది.

ఇవీ చదవండి: ప్రైవేటీకరణపై తగని అత్యుత్సాహం

చిన్న తరహా పరిశ్రమలకు ఎమ్ఎస్ఎమ్ఈ పాలసీ

క‌న్జ్యూమ‌ర్ డ్యూర‌బుల్ లోన్ ఏంటి? ఎందుకు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.