ఫార్మా ఔషధ దిగ్గజం సన్‌ఫార్మా.. దేశీయ మార్కెట్లో స్వల్ప, మధ్య స్థాయి లక్షణాలున్న కరోనా బాధితులకు వాడే.. ఫావిపిరవిర్ ఔషధాన్ని విడుదల చేసింది. 'ఫ్లూగార్డ్' పేరుతో ఈ వారం నుంచే మార్కెట్లో ఔషధం లభిస్తుందని సన్‌ఫార్మా వెల్లడించింది. 200 ఎంజీ పరిమాణంలోని ఒక్కో మాత్ర ధర రూ.35గా నిర్ణయించింది.
స్వల్ప, మధ్యస్థాయి లక్షణాలున్న కరోనా బాధితులు వాడేందుకు దేశంలో అనుమతి ఉన్న ఔషధం ఫావిపిరవిర్ ఒక్కటే.
దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైన వారందరికి 'ఫ్లూగార్డ్' ఔషధం అందుబాటులో ఉండేలా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని సన్‌ఫార్మా వెల్లడించింది. అందుకే తక్కువ ధరకు ఈ ఔషధాన్ని విక్రయించాలని నిర్ణయించినట్లు వివరించింది.
మరో ఫార్మా సంస్థ గ్లెన్‌మార్క్ ఫావిపిరవిర్‌ను గత నెలలోనే 'ఫ్యాబిఫ్లూ' పేరుతో మార్కెట్లోకి తెచ్చింది. అయితే గ్లెన్‌మార్క్ ఒక్కో ఫావిపిరవిర్ మాత్రను తొలుత రూ.103కు విక్రయించింది. ఆ తర్వాత రూ.75కు ధర తగ్గించింది.
ఇదీ చూడండి:వ్యవసాయ రంగం అండతోనే కరోనా సంక్షోభం దూరం!