దేశంలో 4జీ నెట్‌వర్క్ విస్తరణ సహా, నెట్‌వర్క్ నాణ్యత పెంపునకు టెలికాం ఉపకరణాల తయారీ సంస్థ నోకియాతో టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం విలువ సుమారు రూ.7,500 కోట్లుగా ఉండొచ్చని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
దేశంలోని తొమ్మిది సర్కిళ్లలో సింగిల్ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ (ఎస్ఆర్ఏఎన్) సర్వీసులు అందించేందుకు నోకియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. భవిష్యత్‌లో 5జీ నెట్వర్క్అందించేందుకు ఈ ఒప్పందం ద్వారా పునాది పడినట్లు తెలిపింది. ఈ డీల్‌తో తొమ్మిది సర్కిళ్లలో 300,000 రేడియో యూనిట్లను వివిధ స్పెక్ట్రమ్ బ్యాండ్లలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. 2022 వరకు ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఎయిర్టెల్ వివరించింది.
ఇదీ చూడండి:70 శాతం తగ్గిన వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్‌లు