ETV Bharat / business

70 శాతం తగ్గిన వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్​లు - వాట్సాప్ లేటెస్ట్ న్యూస్

తమ యాప్​లో ఫార్వర్డ్ మెసేజ్​లు 70 శాతం తగ్గినట్లు వాట్సాప్ యాజమాన్యం ప్రకటించింది. కరోనా నేపథ్యంలో తప్పుడు సమాచారం వ్యాప్తిని నిరోధించేందుకు విధించిన పరిమితి నిబంధనే ఫార్వర్డ్ మెసేజ్​లు తగ్గడానికి కారణం అని తెలిపింది.

70 percent drop in whatsapp forward messages
వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్​లు 70 శాతం డ్రాప్​
author img

By

Published : Apr 28, 2020, 12:35 PM IST

Updated : Apr 28, 2020, 12:47 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తరచుగా ఫార్వర్డ్ అయ్యే మెసేజ్‌లపై పరిమితి విధిస్తూ వాట్సాప్​ తీసుకున్న నిర్ణయం ఫలితాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తమ యాప్​లో ఫార్వర్డ్ మెసేజ్​లు 70 శాతం వరకు తగ్గినట్లు వాట్సాప్ ప్రకటించింది.

కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​తో ప్రపంచ దేశాల్లో కోట్లాది మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. స్నేహితులు, బంధులను కలుసుకునే వీలు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వాట్సాప్​ వంటి యాప్​లలో సంభాషణలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇదే సమయంలో కరోనాకు సంబంధించిన అసత్య సమాచారాన్ని నిర్ధరించుకోకుండానే చాలా మంది ఫార్వర్డ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టేందుకు ఏప్రిల్ 7 నుంచి ఫార్వర్డ్ మెసేజ్​లపై పరిమితులు విధిస్తూ వాట్సాప్ నిర్ణయం తీసుకుంది. ఒక సారి ఒకరికి మాత్రమే ఫార్వర్డ్​ మెసేజ్ పంపే వీలుంటుందని స్పష్టం చేసింది. ఫలితంగానే ఫార్వర్డ్ మెసేజ్​లు గణనీయంగా తగ్గినట్లు వాట్సాప్ ప్రకటించింది.

అంతకు ముందు వాట్సాప్​లో ఫార్వర్డ్ మెసేజ్​లను ఒకే సారి ఐదుగురికి పంపే వీలుండేది.

ఇదీ చూడండి:'అక్టోబర్​ నుంచి అమెరికా ప్రగతి రథం పరుగులు'

Last Updated : Apr 28, 2020, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.