ETV Bharat / business

T-Hub CEO: 'ఆలోచనతో వస్తే.. వ్యాపారవేత్తలుగా మారుస్తాం'

ఒకటి రెండేళ్లు కష్టపడి, స్థిరత్వం సాధిస్తే చాలు.. పెట్టుబడులే వెతుక్కుంటూ వస్తాయని టి-హబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(T-Hub CEO) మహంకాళి శ్రీనివాస్ రావు తెలిపారు. 130 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశ మార్కెట్​ను ఆకర్షించగలిగితే చాలు అని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే రెండుమూడేళ్లు అంకుర సంస్థలకు ఎంతో అనుకూల కాలం అని పేర్కొన్నారు.

T-Hub CEO, srinivas Mahankali news
టీహబ్ సీఈవో, శ్రీనివాస్ రావు మహంకాళి న్యూస్
author img

By

Published : Nov 6, 2021, 7:04 AM IST

‘వినూత్న ఆవిష్కరణలు.. సరికొత్త ఆలోచనలకు 130 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశమే అతి పెద్ద విపణి. అంకుర సంస్థలు ఈ దిశగా ప్రయత్నిస్తే విజయం వాటి సొంతమవుతుంది. ఒకటి రెండేళ్లు కష్టపడి, స్థిరత్వం సాధిస్తే చాలు.. పెట్టుబడులే వెతుక్కుంటూ వస్తాయి. కొవిడ్‌-19 కొన్ని అంకురాలకు మేలు చేసింది. మరికొన్ని సంస్థలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుని, వేగంగా వృద్ధి చెందుతున్నాయి. రాబోయే రెండుమూడేళ్లు అంకుర సంస్థలకు ఎంతో అనుకూల కాలం’ అని టి-హబ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(T-Hub CEO) మహంకాళి శ్రీనివాస్‌ రావు తెలిపారు. రానున్న రోజుల్లో యూనికార్న్‌ (100 కోట్ల డాలర్లు లేదా రూ.7500 కోట్ల) సంస్థలు హైదరాబాద్‌ నుంచీ ఆవిర్భవిస్తాయనే విశ్వాసాన్ని ‘ఈనాడు-ఈటీవీ భారత్​’ ప్రత్యేక ఇంటర్వ్యూలో వ్యక్తం చేశారు. ముఖ్యాంశాలివీ..

అంకురాలకు కొవిడ్‌-19 ఎలాంటి సవాలు విసిరింది. ఈ సమయంలో టి-హబ్‌ ఎలాంటి పాత్ర పోషించింది?
కరోనా పరిణామాలతో కొన్ని అంకురాలు ఇబ్బంది పడ్డాయి. ఉత్పత్తులు, సేవలకు గిరాకీ తగ్గడం, నగదు నిల్వలు హరించుకుపోవడం సవాలుగా మారింది. కొన్ని అంకురాలు సత్వరం ప్రణాళిక మార్చుకుని, ఈ సవాలుకు ఎదురు నిలిచాయి. కష్ట సమయంలో ప్రతి స్టార్టప్‌తోనూ టి-హబ్‌ కలిసి పనిచేసింది. ‘రీజిగ్‌’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి, మెంటార్లను ఏర్పాటు చేయడం, ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదర్చడంలో అండగా నిలిచాం. ఒత్తిడి వల్ల కొన్ని అంకురాలు తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపాయి. అవీ త్వరలోనే తిరిగి ప్రారంభం అవుతాయని ఆశిస్తున్నాం.

అంకుర సంస్థల ఏర్పాటుకు టి-హబ్‌ చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి?
విద్యార్థి దశలోనూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కిక్‌స్టార్ట్‌ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటికే 30కి పైగా కాలేజీలలో దీన్ని ప్రారంభించి, ఒక్కో కాలేజీలో 50 మంది విద్యార్థులను గుర్తించాం. దీంతోపాటు లాంచ్‌పాడ్‌, మాస్టర్‌ క్లాస్‌ అనేవీ ఉన్నాయి. ఆలోచనతో వచ్చిన వారిని వ్యాపారులుగా మార్చడమే మా ప్రధాన లక్ష్యం. ప్రముఖ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని, అంకురాలకు విస్తృత మార్కెట్‌ కల్పిస్తున్నాం. ప్రస్తుతం విద్యుత్‌ వాహనాలు, మొబిలిటీ పరిష్కారాలపై దృష్టి పెట్టాం. ల్యాబ్‌ 32 కింద 6 విడతల్లో 150 సంస్థలను ప్రోత్సహించాం. ఈ నెలలోనే ఏడో విడత ప్రారంభం కానుంది.

పెట్టుబడుల సమీకరణలో అంకురాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీన్ని అధిగమించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
వినూత్న ఆవిష్కరణలు, ఆలోచనలకు పెట్టుబడుల ఇబ్బందే ఉండదు. హైదరాబాద్‌లో 5వేలకు పైగా అంకురాలున్నాయి. గత అయిదారేళ్లుగా వీటికి పెట్టుబడులు బాగానే అందుతున్నాయి. 275 కంపెనీలకు ఇప్పటి వరకు దాదాపు 400 కోట్ల డాలర్ల (సుమారు రూ.30,000 కోట్ల) పెట్టుబడులు వచ్చాయి. ప్రాథమికంగా నిధులు లభించక ఇబ్బంది పడే సంస్థల కోసం ప్రత్యేకంగా టి-ఫండ్‌ ప్రారంభించాం. ఇందులో పాల్గొనేందుకు 30 సంస్థలు ఆసక్తి చూపించాయి. ఇందులో 4-5 సంస్థలను గుర్తించాం. త్వరలోనే అర్హత ఉన్న సంస్థలకు పెట్టుబడులు అందే ఏర్పాటు చేస్తాం.

దేశంలో యూనికార్న్‌ల సంఖ్య బాగా పెరిగింది. ఆ జాబితాలో హైదరాబాద్‌కు ఎప్పుడు స్థానం లభిస్తుంది?
బెంగళూరు, ముంబయి, దిల్లీలలో అంకుర వ్యవస్థ రెండు దశాబ్దాల క్రితమే ప్రారంభం కాగా, మన దగ్గర ఏడెమినిదేళ్ల నుంచే అంకురాలు పెరిగాయి. అంటే, మనం 10 ఏళ్ల వెనక ఉన్నట్లే. దేశంలో ఈ రోజు కొత్త అంకురాలకు చిరునామాగా హైదరాబాద్‌ మారుతోంది. మరో రెండుమూడేళ్లలో ఇక్కడి నుంచీ యూనికార్న్‌లు ఆవిర్భవిస్తాయి.

అంకురాలు విజయవంతం కావాలంటే మీరిచ్చే సూచనలు ఏమిటి?
ఆలోచనపై నమ్మకం.. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడే ధైర్యం.. మంచి బృందం.. ఇవి ఒక అంకురానికి ప్రాణం. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశ విపణిని ఆకర్షిస్తే చాలు.

కొత్త టి-హబ్‌ భవనం ఎప్పుడు అందుబాటులోకి రాబోతుంది?
దేశవ్యాప్తంగా ఆవిష్కరణలకు హైదరాబాద్‌ నంబర్-1 స్థానంలో ఉండాలి. ఐఐఐటీహెచ్‌, ఐఎస్‌బీలలో ఉన్న ఇంక్యుబేటర్లతో పాటు, విహబ్‌, టాస్క్‌, టీఎస్‌ఐసీ, సీఐఐ, టై హైదరాబాద్‌, హైసియా ఇలా అన్ని విభాగాలు, పరిశ్రమ వర్గాలతో కలిసి పనిచేస్తున్నాం. కొత్త టి-హబ్‌ భవనం వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. ఇక్కడ 150-160 సంస్థలు ఉంటాయి.

ఇదీ చదవండి: Pratidhwani: పెట్రో ధరల తగ్గింపుతో సామాన్యులకు ఊరట ఎంత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.