దేశంలో ఇంధన ధరలు రాకెట్ వేగంతో (Petrol Price today) దూసుకెళ్తున్నాయి. వరుసగా నాలుగో రోజూ ధరలు పెంచుతూ (Petrol Price Hike) చమురు పంపిణీ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. శనివారం (Petrol Price hike today) లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 35 పైసలు పెంచాయి. దీంతో గడిచిన 18 నెలల్లో లీటర్ పెట్రోల్‌పై రూ.36, డీజిల్‌పై రూ.26.58 పెరిగినట్లైంది.
2020 మే 5న పెట్రోల్‌పై రికార్డు స్థాయిలో ఎక్సైజ్ సుంకాన్ని (Petrol Excise Duty) పెంచింది కేంద్రం. దాంతో లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రూ.35.98కు, డీజిల్‌పై రూ.26.58కు చేరుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు కనిష్ఠంగా 19 డాలర్లకు పడిపోయినప్పటికీ.. ఎక్సైజ్ సుంకం పెంపుతో ఆ ఫలాలు సామాన్యుడికి అందకుండా పోయాయి(petrol price hike news ). ఆ తర్వాత అంతర్జాతీయ ధరలు క్రమంగా కోలుకున్నాయి. ఇటీవల బ్యారెల్ చమురు 85 డాలర్లకు చేరింది.
ఈ ప్రభావంతో దేశీయంగా ఇంధన ధరలు పెరిగాయి(petrol diesel prices news). మధ్యప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో ఇంధన ధరలు గరిష్ఠ స్థాయికి చేరాయి. దేశంలో ఎక్కడా లేనంతగా లీటర్ పెట్రోల్ ధర రూ.119కి ఎగబాకింది. డీజిల్ ధర రూ.108 దాటింది.
మాటల యుద్ధం..
ఇక సామాన్య ప్రజలపై తీవ్ర భారం చూపే ఇంధన ధరల అంశంలో పాలక, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది(petrol price hike reason ). సుంకాలను సగానికి తగ్గించాలంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలను కొట్టిపారేస్తూ.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా టీకాలకు, ఇతర అభివృద్ధి పనులకు నిధులు సుంకాల నుంచే వస్తున్నాయని చెప్పుకొచ్చారు. సుంకాలను తగ్గించుకోవడం అంటే.. సొంత కాలిని నరుక్కోవడమేనంటూ వ్యాఖ్యానించారు.
"ఇటీవలే మనం వంద కోట్ల కరోనా టీకా డోసుల పంపిణీ పూర్తి చేశాం. ఏడాది కాలంగా 90 కోట్ల మందికి మూడు పూటలా భోజనం పెడుతున్నాం. ఉజ్వల పథకాన్ని అమలు చేస్తున్నాం. వీటితో పాటు మరెన్నో పథకాలను రూ.32 ఎక్సైజ్ సుంకంతోనే అమలు చేస్తున్నాం. దేశంలో ఇలాంటి విషయాలపై సులభంగా రాజకీయం చేస్తారు. 'ధరలు పెరిగాయి. పన్నులు తగ్గించండి' అని."
-హర్దీప్ సింగ్ పురీ, కేంద్ర మంత్రి
జీఎస్టీలోకి పెట్రోల్.. కష్టమే!
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలంటే(petrol diesel prices news ) వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని పలువురు ప్రతిపాదిస్తున్నారు. ఈ అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ పరిశీలనలోకి తీసుకోవాలని కేరళ హైకోర్టు కూడా సూచనలు చేసింది. అయితే, దీనిపై కేంద్ర, రాష్ట్రాలు వెనకడుగు వేస్తున్నాయి.
కేరళ హైకోర్టు సూచన మేరకు జీఎస్టీ మండలి సైతం సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సిద్ధంగా లేవని తేల్చింది. పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధికి బయటే ఉంచాలని ప్యానెల్ ఏకగ్రీవంగా నిర్ణయించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
'కాంగ్రెస్ వల్లే ధరలు పెరిగాయ్!'
మరోవైపు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు.. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు పరోక్షంగా ముడిపెట్టారు కేంద్ర మంత్రి పురీ. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం జారీ చేసిన రూ.1.34 లక్షల కోట్ల ఆయిల్ బాండ్లు కూడా పెట్రోల్ ధరల పెరుగుదలకు కారణమయ్యాయని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలపై సుంకాలను తగ్గించే ప్రణాళికేది తమ వద్ద లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitharaman on petrol price) సైతం ఇటీవల పేర్కొన్నారు. ఆయిల్ బాండ్లకు వడ్డీ, ఆసలు చెల్లింపులు ఇంకా పూర్తికాకపోవడమే ఇందుకు కారణమని చెప్పారు.
బాండ్లపై వడ్డీ కన్నా.. ఆదాయమే అధికం!
అయితే బాండ్ల చెల్లింపునకు కావాల్సిన మొత్తం కన్నా మూడు రెట్లు అధిక ఆదాయాన్ని.. ఎక్సైజ్ సుంకాల (Excise duty on petrol) ద్వారా.. నాలుగు నెలల్లోనే గడించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
యూపీఏ హయాంలో వంట గ్యాస్, కిరోసిన్‌తో పాటు పెట్రోల్, డీజిల్ సైతం సబ్సిడీ ధరలకు లభించేది. రాయితీపై ఇంధనం సరఫరా చేయడానికి ప్రభుత్వ రంగ రిటైలర్లకు రూ.1.34 లక్షల కోట్ల చమురు బాండ్లను యూపీఏ కాలంలో జారీ చేశారు. అందులో రూ.3,500 కోట్ల అసలు కింద కేంద్రం చెల్లించింది. ఇంకా చెల్లించాల్సింది రూ.1.3లక్షల కోట్లు. ఈ మొత్తాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరంలోగా చెల్లించాల్సి ఉంది. ఆ లెక్కన ఈ ఏడాది (2021-22)లో రూ.10వేల కోట్లు చెల్లించాలి. ఇక 2023-24లో రూ.31,150 కోట్లు, 2024-25లో రూ.52,860.17 కోట్లు, 2025-26లో రూ.36,913 కోట్లు చెల్లించాల్సి ఉంది.
మరోవైపు పెట్రో ఉత్పత్తులపై ఇప్పటికే కేంద్రానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. 2020-21 మధ్య పెట్రోల్, డీజిల్‌పై రూ.3.35 లక్షల కోట్లు సమకూరింది. అంతకుముందు ఏడాది ఈ మొత్తం రూ.1.78లక్షల కోట్లుగా ఉంది. అంటే 88 శాతం మేర పెరిగినట్లు ఇటీవల పార్లమెంట్‌కు ఇచ్చిన సమాధానంలో కేంద్రమే పేర్కొంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయకుండా కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడు రోజువారీ ధరల సవరణతో ఇప్పుడు సామాన్యులపై భారం పడుతోంది. ఈ భారం నుంచి ఊరట కల్పించాలని ప్రజల నుంచి వినతులు వస్తున్న వేళ ఆయిల్ బాండ్లను కేంద్రం తెరపైకి తీసుకొస్తుండడం గమనార్హం!!
ఇదీ చదవండి: బాండ్ల పేరుతో సుంకాల బాదుడు.. పెట్రో మోత అందుకే!