ETV Bharat / business

'సరఫరా సేవలకు విద్యుత్‌ వాహనాలు'

తమ వినియోగదారులకు డెలివరీలు అందించేందుకు విద్యుత్​ వాహనాలు వినియోగించనున్నట్లు తెలిపింది మహీంద్రా లాజిస్టిక్స్​. ఇప్పటికే ఈ కామర్స్​ దిగ్గజం అమెజాన్​.. మహీంద్రా ఎలక్ట్రిక్​, కైనెటిక్​ గ్రీన్​ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ తరుణంలో మహీంద్రా లాజిస్టిక్స్​ కీలక ప్రకటన చేసింది.

author img

By

Published : Dec 28, 2020, 5:39 AM IST

వినియోగదారులకు డెలివరీలు అందించేందుకు వీలుగా విద్యుత్‌ వాహనాలను వినియోగించనున్నట్లు మహీంద్రా లాజిస్టిక్స్‌ తెలిపింది. 2025-26 నాటికి రూ.10,000 కోట్ల టర్నోవర్‌ను సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఈ- కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా తమ కొనుగోలుదార్లకు వస్తువుల సరఫరాకు విద్యుత్తు వాహనాలు వినియోగించాలని నిర్ణయించింది. ఇందుకోసం మహీంద్రా ఎలక్ట్రిక్‌, కైనెటిక్‌ గ్రీన్‌ సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది.

ఫర్నీచర్‌ రిటైలర్‌ ఐకియా (గతి లాజిస్టిక్స్‌ ద్వారా), గ్రోసరీల సంస్థ బిగ్‌బాస్కెట్‌ కూడా ఉత్పత్తుల సరఫరాకు విద్యుత్‌ వాహనాల వినియోగానికి సిద్ధమవుతున్న తరుణంలో మహీంద్రా లాజిస్టిక్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే రెండేళ్లలో ఏడాదికి 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో గోదాములను నిర్మిస్తామని, ఒక్కో గోదాము 4-5 లక్షల చదరపు అడుగులతో ఉంటుందని కంపెనీ ఎండీ, సీఈఓ రామ్‌ప్రవీణ్‌ స్వామినాధన్‌ తెలిపారు. ప్రస్తుతం కంపెనీ చేతిలో 16 మిలియన్‌ చదరపు అడుగుల స్థలం ఉంది. ఒక్క మూడో త్రైమాసికంలోనే హైదరాబాద్‌, చెన్నైల్లో 0.75 మి.చదరపు అడుగుల స్థలాన్ని పెంచుకుంది. కొత్త సేవలు ప్రారంభించడం, ప్రస్తుత విభాగాల సామర్థ్యం పెంచనున్నట్లు రామ్‌ప్రవీణ్‌ తెలిపారు.

ఇదీ చూడండి: కొత్త ఏడాదిలో బంగారం ధరకు రెక్కలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.