ETV Bharat / business

జూన్ నుంచి బంగారంపై హాల్​మార్క్ తప్పనిసరి

బంగారం స్వచ్ఛతను నిర్ధరించే హాల్​మార్క్​ పద్ధతిని జూన్ 1 నుంచి తప్పనిసరి చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. బీఐఎస్​కు మారేందుకు ఉన్న గడువు పొడగించేది లేదని తెలిపింది.

author img

By

Published : Apr 13, 2021, 5:59 PM IST

Govt to implement mandatory gold hallmarking from Jun 1
జూన్ నుంచి బంగారంపై హాల్​మార్క్ తప్పనిసరి

బంగారు ఆభరణాలపై జూన్ 1 నుంచి హాల్​మార్క్ తప్పనిసరి కానుంది. దీన్ని అమలు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

పసిడి స్వచ్ఛతను నిర్ధరించే ఈ హాల్​మార్క్​ పద్ధతిని అమలు చేయాలని 2019 నవంబర్​లో కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం వ్యాపారులకు 2021 జనవరి 15 వరకు గడువు ఇచ్చింది. కరోనా నేపథ్యంలో వ్యాపారుల అభ్యర్థన మేరకు దీన్ని జూన్ 1 వరకు పెంచింది. ఇకపై గడువును పొడగించేది లేదని తాజాగా స్పష్టం చేసింది.

ఇప్పటివరకు 34,647 మంది వ్యాపారులు బీఐఎస్​తో రిజిస్టర్ అయ్యారు. వచ్చే రెండు నెలల్లో ఈ సంఖ్య లక్ష దాటుతుందని అధికారులు తెలిపారు. జూన్ 1 నుంచి... 14, 18, 22 క్యారెట్ల బంగారాన్ని మాత్రమే విక్రయించేందుకు అనుమతులు ఉంటాయని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: మారుతీ కార్లలో బెస్ట్ సెల్లర్స్​ ఇవే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.