ETV Bharat / business

'ఆ విమానాల్లో ఐసోలేషన్ జోన్ అక్కర్లేదు' - air india

విమానంలో ఐసొలేషన్ జోన్ ఉండాలన్న నిబంధనలో కేంద్రం మార్పలు చేసింది. నాలుగు గంటల్లోపు ప్రయాణం పూర్తిచేసుకునే విమానాలకు ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది.

center- loosens- restrictions- on- flights
విమానయాన సంస్థలకు నిబంధనల సడలింపు
author img

By

Published : Dec 20, 2020, 5:41 AM IST

దేశంలో రోజురోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నందున విమానయాన సంస్థలకు విధించిన ఆంక్షలను మరింత సడలించాలని కేంద్రం నిర్ణయించింది. నాలుగు గంటల వ్యవధిలోపు ప్రయాణం పూర్తిచేసుకునే విమానాల్లో ఐసోలేషన్ జోన్​ని ఏర్పాటుచేయాలన్న నిబంధనను ఎత్తివేసింది. అంతర్జాతీయ విమానాలకు సడలింపులివ్వాలని ఎయిరిండియా సీఎండీ రాజీవ్ బన్సాల్ చేసిన విజ్ఞప్తి అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ఈ నెల 16న పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలలో క్వారంటైన్ కోసం ఏదైనా సీటును ఖాళీగా విడిచి పెట్టాలన్న నిబంధనను సవరించింది. నాలుగు గంటలకు మించిన ప్రయాణ వ్యవధి ఉన్న విమానాల్లో చివరి వరుసలోని కుడివైపునున్న సీట్లను క్వారంటైన్ కోసం రిజర్వు చేయాలని ఆదేశాల్లో తెలిపింది. గగనతలంలో ప్రయాణికులకు కొవిడ్ సంబంధిత లక్షణాలు వృద్ధి చెందితే.. వారికోసం అవసరమైన పీపీఈ కిట్లను విమానయాన సంస్థలు సమకూర్చాలని పేర్కొంది.

ఇదీ చూడండి : బీఎస్​ఎఫ్ జవాను ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.