ETV Bharat / business

బ్యాంకుల అదిరే ఆఫర్లు- తక్కువ వడ్డీకే హోంలోన్స్​! - హెచ్​డీఎఫ్​సీ హోం లోన్ ఆఫర్లు

దేశవ్యాప్తంగా పండుగ సీజన్​కు మొదలైంది. ఈ సీజన్​లో సేల్స్ పెంచుకునేందుకు వాహన సంస్థలు, ఈ-కామర్స్ కంపెనీలు ప్రత్యేక ఆఫర్లతో (Festive offers) సిద్ధమవుతున్నాయి. ఇవే కాకుండా హోం లోన్స్ (Bank offers on Home loans)​, వాహన రుణంపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి బ్యాంకులు, రుణ సంస్థలు. ఇప్పటి వరకు వివిధ బ్యాంకులు ప్రకటించిన ఆఫర్ల (Festival loan offers) పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Bank offers on Home loans
హోంలోన్స్​పై బ్యాంకుల ఆఫర్లు
author img

By

Published : Sep 21, 2021, 1:45 PM IST

పండుగ సీజన్​ వచ్చేసింది. ఈ నేపథ్యంలో బ్యాంకులు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. హోం లోన్స్​, వాహన రుణంపై వడ్డీ రాయితీ ఇస్తున్నాయి. ఇప్పటి వరకు వివిధ బ్యాంకులు ప్రకటించిన లోన్ ఆఫర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎస్​బీఐ

SBI
ఎస్​బీఐ

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ అన్నింటికన్నా ముందుగా పండుగ సీజన్ ఆఫర్లు (SBI offers) ప్రకటించింది. క్రెడిట్​ స్కోర్​ ఆధారంగా ఇచ్చే హోం లోన్స్ (SBI Home loan) వడ్డీ రేటును 45 బేసిస్​ పాయింట్లు తగ్గించింది.

ఇంతకు ముందు రూ.75 లక్షల వరకు హోం లోన్​పై (SBI home loan Interest rate) 7.15 శాతం వడ్డీ వసూలు చేసేది ఎస్​బీఐ. ఇకపై రుణ మొత్తంతో సంబంధం లేకుండా.. వడ్డీ రేటు 6.70గా ఉంటుందని వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల 30 ఏళ్ల కాల పరిమితితో.. రూ.75 లక్షల రుణం తీసుకుంటే రూ.8 లక్షల వరకు వడ్డీ భారం తగ్గనుందని తెలిపింది.

ఉద్యోగులతో పోలిస్తే.. ఉద్యోగేతరులకు మధ్య ఉన్న 15 బేసిస్​ పాయింట్ల వడ్డీ రేటు అంతరాన్ని కూడా తొలగించింది ఎస్​బీఐ.

పీఎన్​బీ

PNB
పీఎన్​బీ

పంజాబ్​ నేషనల్ బ్యాంక్ (పీఎన్​బీ) కూడా పండుగ సీజన్​ ఆఫర్​ (PNB offers) కింద.. రూ.50 లక్షలకుపైగా హోం లోన్ (PNB home loan offers) తీసుకుంటే.. 0.50 శాతం వడ్డీ రేటు తగ్గిస్తున్నట్లు తెలిపింది. దీనితో వడ్డీ రేటు 6.60 శాతానికి (PNB Home loan interest rate) దిగిరానుందని, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇస్తున్న వడ్డీ రేట్లలో ఇదే అత్యల్పమని పీఎన్​బీ పేర్కొంది.

క్రెడిట్​ స్కోరు అనుసంధానిత రుణాలపై ఈ ఆఫర్​ వర్తిస్తుందని తెలిపింది పీఎన్​బీ. ఇప్పటికే.. హోం లోన్స్​, వాహన రుణం​, పర్సనల్​ లోన్స్​, పెన్షన్​ లోన్స్​, ప్రాపర్టీ, గోల్డ్ లోన్స్​పై 'ఫెస్టివల్ బొనాంజా ఆఫర్' కింద ప్రాసెసింగ్​, సర్వీస్​ ఛార్జీలను రద్దు చేసినట్లు వివరించింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా

Bank of Baroda
బ్యాంక్​ ఆఫ్​ బరోడా

మూడో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్​.. బీఓబీ (బ్యాంక్ ఆఫ్​ బరోడా) కూడా పండుగ సీజన్ ఆఫర్​ (BoB offers) కింద హోం లోన్స్​పై వడ్డీ రేట్లను 0.25 శాతం (BoB Home loan Interest rate) తగ్గిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 7 శాతంగా ఉన్న హోం లోన్​ వడ్డీ రేట్లు 6.75 శాతానికి దిగిరానున్నట్లు పేర్కొంది.

హెచ్​డీఎఫ్​సీ

HDFC
హెచ్​డీఎఫ్​సీ

ప్రైవేటు రంగ రుణ సంస్థ హెచ్​డీఎఫ్​సీ కూడా పండుగ సీజన్​ ప్రత్యేక ఆఫర్లను (HDFC offers) తీసుకొచ్చింది. రుణ మొత్తం, కేటగిరీతో సంబంధం లేకుండా హోం లోన్స్ వార్షిక వడ్డీ రేటు 6.70 శాతం (HDFC home loan interest) నుంచి ప్రారంభమవనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్​ 20 నుంచి వచ్చే హోం లోన్​ అప్లికేషన్స్​ అన్నింటికీ కొత్త వడ్డీ రేట్లే వర్తిస్తాయిని పేర్కొంది.

క్రెడిట్​ స్కోరు 800కు పైగా ఉన్న వినియోగదారులందరికీ.. 6.70శాతం వడ్డీకే రుణం లభిస్తుందని వివరించింది హెచ్​డీఎఫ్​సీ. ఇంతకుముందు రూ.75 లక్షల హోం లోన్​పై వడ్డీ రేటు.. ఉద్యోగులకైతే 7.15 శాతం, ఉద్యోగేతరులకు 7.30 శాతంగా ఉండేది.

కోటక్ మహీంద్రా బ్యాంక్

Kotak Mahindra bank
కోటక్ మహీంద్రా బ్యాంక్

ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్​ కూడా పండుగ సీజన్ ఆఫర్​ (Kotak Festival offers) ద్వారా.. హోం లోన్స్​పై 0.15 శాతం వడ్డీని తగ్గిస్తున్నట్లు తెలిపింది. హోం లోన్స్​పై 6.50 శాతం వడ్డీ వసూలు (Kotak interest rate on Home loans) చేయనున్నట్లు పేర్కొంది. మార్ట్​గేజ్​ రుణాలపై కూడా వడ్డీ రేటు 6.50 శాతం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపింది. నవంబర్ 8 వరకు ఈ ఆఫర్​ అందుబాటులో ఉంటుందని వివరించింది.

కొత్తగా తీసుకునే రుణాలతో పాటు.. ఇప్పటికే లోన్ మంజూరై ఖాతాలో డబ్బు జమ చేయాల్సిన వారికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది కోటక్ మహీంద్రా బ్యాంక్​.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.