ETV Bharat / briefs

చెరువుల ఆక్రమణలు సహించేది లేదు: అరికెపూడి గాంధీ

అన్యాక్రాంతం అవుతున్న చెరువులను కాపాడి... సుందరీకరణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రభుత్వ విప్ ఆరికపూడి గాంధీ తెలిపారు. మేడ్చల్ జిల్లా కూకట్ పల్లి పరిధిలోని పరికి చెరువు ప్రాంతాన్ని సందర్శించారు. సమీపంలో ఉన్న ప్రభుత్వ సర్వే నెంబర్లలో చెరువును పూడ్చి వేసి అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకునేలా కృషిచేస్తానని తెలిపారు.

Mla arikepudi gandhi visited pariki pond in kukatpally
చెరువుల ఆక్రమణలు సహించేది లేదు: అరికెపూడి గాంధీ
author img

By

Published : Jun 12, 2020, 3:36 PM IST

మేడ్చల్ జిల్లా కూకట్​పల్లి పరికి చెరువు పరిసర ప్రాంతాల్లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరికపూడి గాంధీ పర్యటించారు. స్థానిక కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్, జగన్​తో కలిసి చెరువు హద్దులను పరిశీలించారు. చెరువు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను గమనించారు.

20 అడుగుల ఎత్తు మేర చెరువును పూడుస్తున్నప్పటికీ... కొంత మంది రెవెన్యూ అధికారులు చూస్తూ ఉండిపోయారని మండిపడ్డారు. చెరువు ఆక్రమణ విషయమై రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కూకట్​పల్లి ప్రభుత్వ సర్వేనెంబర్ 336, కుత్బుల్లాపూర్ సర్వేనెంబర్ 348లో ఆక్రమణలను తొలగించి పరికి చెరువును సుందరీకరణ చేస్తామన్నారు. అనుమతులు లేకుండా లేఅవుట్ చేసి నిర్మాణాలు సాగిస్తున్న వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.