ETV Bharat / briefs

పకడ్బందీ వ్యూహాలతో క్షేత్ర స్థాయిలో పాగా

ముందస్తు ఎన్నికల్లో జయ భేరి మోగించిన తెలంగాణ రాష్ట్ర సమితి..స్థానిక సంస్థల్లోనూ కారు జోరు అలాగే కొనసాగింది. పక్కా ప్రణాళికతో వ్యవహరించి క్షేత్రస్థాయిలో పాగా వేసింది.

అన్ని వర్గాలకు ప్రాధాన్యం
author img

By

Published : Jun 9, 2019, 6:15 AM IST

Updated : Jun 9, 2019, 9:04 AM IST

పక్కా ప్రణాళికతో క్షేత్రస్థాయిలో తెరాస పాగా

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం నమోదు చేసిన తెరాస... క్షేత్రస్థాయిలో తన ఆధిపత్యాన్ని బలపరుచుకుంది. ప్రభుత్వ పథకాలు, పకడ్బందీ వ్యూహాలతో ప్రచారం నిర్వహించి.... తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నీ తానై నడిపించారు.

'స్థానిక సంస్థలకు ముందే సిద్ధమైన తెరాస'
లోక్​సభ ఎన్నికల ఫలితాలు రాకముందే ప్రాదేశిక ఎన్నికలకు గులాబీ దళం సిద్ధమైంది. తెరాస అధినేత, సీఎం కేసీఆర్ ఊహించినట్లుగానే స్థానిక సంస్థల్లో కారు జోరు సాగింది. రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. సుమారు 80 శాతానికి పైగా మండల పరిషత్​లో గులాబీ జెండా ఎగరవేసింది.
'అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం'
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అవకాశం రాని వారికి జడ్పీ పీఠాల్లో సముచిత స్థానం కల్పించారు. అంతే కాకుండా ఉద్యమ సమయం నుంచి పార్టీ వెన్నంటి నడిచిన వారికి సైతం తగిన ప్రాధాన్యం కల్పించారు. ఈ దఫా ఏకంగా 20 జడ్పీ ఛైర్మన్​ స్థానాల్లో అతివలకు అవకాశం ఇచ్చారు.
లోక్​సభ ఎన్నికల్లో..
లోక్​సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి కారణాలపై తెరాసలో స్పష్టత వచ్చింది. మండల, జిల్లా పరిషత్​ల ఎన్నికల ఫలితాలతో క్షేత్ర, రాష్ట్ర స్థాయిలో ఎలాంటి సమస్య లేదనే విషయం తేటతెల్లమైందని పార్టీ నేతలు విశ్లేషించారు. పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ స్థాయి అంశాలు, మోదీ హవానే ప్రధానంగా ప్రభావం చూపాయనే అంచనాకు వచ్చారు.
ఇవీ చూడండి : కొన్నిచోట్ల ఉద్రిక్తం.. మరికొన్ని చోట్ల వాయిదా..

sample description
Last Updated : Jun 9, 2019, 9:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.