రాష్ట్రంలో తెరాసకు భాజపా మాత్రమే ప్రత్యామ్నాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. అందువల్లనే కాంగ్రెస్ అగ్రనేతలు, కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి చేరిపోతున్నారని అభిప్రాయపడ్డారు. ఇవాళ హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలతో సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంటుతోనే కేసీఆర్ విజయం సాధించారని లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్రం దాటితే తెరాస చెల్లని రూపాయేనని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం సొంతంగానే 300 సీట్లు సాధింస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా సమయం ఉన్నా స్థానిక సంస్థల రూపంలో బీసీలకు మరోసారి కేసీఆర్ అన్యాయం చేస్తున్నారన్నారు.
ఈ భేటీలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మురళీధర్‌రావు, కిషన్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, రామచంద్రరావు, రాపోలు ఆనందభాస్కర్, ఇంద్రసేనా రెడ్డి ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.