ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారులు, ఫింఛనర్ల ఐకాస సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 2018 జులై ఒకటి నుంచి వర్తించేలా పీఆర్సీని ప్రకటించాలని లేదా 43 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని కోరింది. పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచాలని కోరారు.
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావాలని కోరింది. రెవెన్యూతో పాటు ఇతర శాఖలను మరో శాఖలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. సీఎం కేసీఆర్పై తమకు పూర్తి విశ్వాసం ఉందని.. ఆయన అన్నింటిని పరిష్కరిస్తారని భావిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఇవీ చూడండి : చెక్ పవర్ వచ్చింది... పనిచేయకుంటే పదవి ఊడుతుంది