శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ ఇంట్లో సోదాలు జరిగాయి. దాదాపు 25 మంది పోలీసులు గచ్చిబౌలి మసీద్ బండలోని నివాసానికి చేరుకున్నారు. తనను బెదిరించి... చరవాణి, ఇంటి తాళాలు లాక్కొన్నారని సెక్యూరిటీ గార్డు చెబుతున్నారు. ఇంట్లోకి ప్రవేశించాక సీసీ కెమెరా వైర్లు తెంచి సోదాలు చేశారని తెలిపారు. పోలీసుల తీరుపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఎవరూ లేనప్పుడు తనిఖీలు ఏంటని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ చదవండిః ఇవాళ చేవెళ్లలో గులాంనబీ ఆజాద్ ప్రచారం