రఫేల్ కుంభకోణం విచారణను కేంద్రం అధీనంలో లేని స్వతంత్ర సీబీఐతో జరిపించాలని దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. దిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం, కోల్కతా కమిషనర్ కార్యాలయాల్ని సోదాలు చేసిన విధంగా ప్రధాని కార్యాలయాన్ని సోదాలు చేయాలని డిమాండ్ చేశారు.
రఫేల్ కుంభకోణంతో సంబంధాలున్న ప్రతీ ఒక్కరిని అరెస్టు చేయాలని ట్విట్టర్ ద్వారా కోరారు. రఫేల్ ఒప్పందంపై చర్చలు సాగుతుండగా ప్రధాని కార్యాలయంలో సమాంతరంగా చర్చలు జరిగాయని, దీనిపై రక్షణ శాఖ అభ్యంతరాలు లేవనెత్తిందని ఓ ప్రధాన పత్రికలో వచ్చిన వ్యాసం ఆధారంగా ఈ విమర్శలు చేసింది ఆప్.
ప్రధానికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమ్ఆద్మీ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ వెల్లడించారు. తమ పార్టీనే ముందుగా రఫేల్ వ్యవహారాన్ని పసిగట్టందని చెప్పుకొచ్చారాయన.