ETV Bharat / bharat

కేరళ నుంచి మళ్లీ 'రాజ్యసభ'కు ఆజాద్​?

గులాం నబీ ఆజాద్​.. కాంగ్రెస్​కు పూర్వవైభవం తేవాలని, పార్టీ అధ్యక్షమార్పు జరగాలని కోరిన హస్తం అసంతృప్త జీ-23 నేతల్లో ప్రముఖులు. రాజ్యసభ అభ్యర్థిత్వంపై ఇప్పుడు మళ్లీ ఆయన చర్చనీయాంశమయ్యారు. కేరళలోని మూడు రాజ్యసభ స్థానాలకు ఏప్రిల్​ 12న ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ప్రకటించగానే ఆజాద్ గురించి వార్తలు వస్తున్నాయి. కేరళ నుంచి కాంగ్రెస్​ ఆయన్ను మళ్లీ రాజ్యసభకు పంపించే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. అయితే అదంత తేలిక కాదని కొందరు కాంగ్రెస్ ​నేతలు అంటున్నారు.

author img

By

Published : Mar 18, 2021, 9:30 PM IST

Will Azad be Congress pick for Rajya Sabha from Kerala?
'కేరళనుంచి రాజ్యసభకు ఆజాద్​'?

గులాం నబీ ఆజాద్..​ 'కాంగ్రెస్​ అధ్యక్షుడు' గాంధీయేతరులే ఉండాలని ప్రతిపాదించిన హస్తం అసంతృప్త నేతల్లో ప్రధాన వ్యక్తి. ఫిబ్రవరి 15న ఆయన రాజ్యసభ పదవీకాలం ముగిసింది. అయితే.. ఇటీవల కశ్మీర్​లో జరిగిన జీ-23 నేతల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించిన ఈ కాంగెస్​ దిగ్గజ నేతను.. హస్తం పార్టీ మళ్లీ రాజ్యసభకు పంపించే సంకేతాలు కనిపిస్తున్నాయి.

మే నెలలో కాంగ్రెస్​ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించి హస్తం పీఠంపై మళ్లీ రాహుల్​ను కూర్చోబెట్టాలని 'సోనియా పరివారమంతా' చూస్తోంది. ​ఈ నేపథ్యంలో.. రాహుల్​ను అధ్యక్షుడు కాకుండా అడ్డంకులు సృష్టిస్తారనే భయంతోనే ఆజాద్​ను రాజ్యసభకు పంపించాలని 'గాంధీ' కుటుంబం అనుకుంటోందా? తద్వారా జీ-23 నేతల డిమాండ్​ను వ్యూహాత్మకంగా ఛేదించాలని భావిస్తోందా? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి.

ఇదీ చూడండి: కాంగ్రెస్​లో జీ23 గుబులు- చీలిక ఖాయమా?

ఇదంతా కేరళలోని మూడు రాజ్యసభ స్థానాలకు ఏప్రిల్​ 12న ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ నుంచి నోటిఫికేషన్​ వెలువడగానే ఊపందుకున్న వార్తలు. కేరళలో ఉన్న 3 రాజ్యసభ సీట్లలో రెండింటిని తన బలంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వామపక్ష కూటమి గెలుచుకుంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మిగతా ఒక స్థానాన్ని కాంగ్రెస్​ చేజిక్కించుకోవడం ఖాయం.

వారిని నిలువరించడానికేనా?

ఆ ఒక్క స్థానం నుంచి గులాం నబీ ఆజాద్​కు మళ్లీ రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్​ అధిష్ఠానం చూస్తోంది. అయితే ఇది కచ్చితంగా కాంగ్రెస్​ అధ్యక్షునిగా రాహుల్​ ఎన్నికకు జీ-23 నేతలు అడ్డొస్తారని, వారిని శాంతింపజేయడానికే 'గాంధీ పరివారం' పన్నిన వల అని అంటున్నారు కొందరు నేతలు. ఒకవేళ ఆయన్ను రాజ్యసభకు పంపించినా అక్కడ ప్రతిపక్షనేత హోదా ఆయనకు ఉండదు. ఎందుకంటే ఇప్పటికే ఆ స్థానంలో పార్టీ సీనియర్​ నేత మల్లికార్జున ఖర్గే ఉన్నారు.

ఆజాద్​ కాకపోతే ఇంకెవ్వరు?

ఒకవేళ ఆజాద్​కు రాజ్యసభ సీటు ఇవ్వకపోతే తర్వాత ఆ స్థానానికి అర్హులు వయలార్​ రవి. కేరళ తరఫున ఇప్పుడు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనను కాదని కాంగ్రెస్​ అసంతృప్త జీ-23 నేతల్లో ప్రధాన వ్యక్తి అయిన గులాం నబీ ఆజాద్​కు ఆ ఒక్క సీటు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు కాంగ్రెస్ ​నేతలు. 'అలా జరిగే ప్రసక్తేలేదు.. రాష్ట్రంలోని నాయకత్వం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని' కూడా కొందరు హస్తం నేతలు బల్లగుద్దుతున్నారు. కేసీ వేణుగోపాల్​ను రాజస్థాన్​ నుంచి రాజ్యసభకు పంపించినప్పుడు ఆ రాష్ట్ర కాంగ్రెస్​ నాయకత్వం వ్యతిరేకించింది. ఇప్పుడు కేరళలో కూడా అదే పునరావృతం అవుతుందని అనేవారూ ఉన్నారు.

కాంగ్రెస్​ నుంచి రాజ్యసభకు పంపించడానికి కేరళలో పార్టీ తరఫున సీనియర్​ నేతలు ఎవరూ లేరు. మొన్నటివరకు కేరళలోని కాంగ్రెస్​లో ఉన్న సీనియర్​ నేత పీసీ చాకో.. హస్తం పార్టీని వీడి శరద్​పవార్​ ఎన్​సీపీలో చేరారు. మిగతా కొందరు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. దాంతో కేరళ పీసీసీ అధ్యక్షుడు ముల్లపల్లి రామచంద్రన్​ ఒక్కరే చెప్పుకోదగ్గ సీనియర్ నేత. గతంలో ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు కాబట్టి.. రాజ్యసభకు పంపించేందుకు రామచంద్రన్​నూ పరిగణనలోకి తీసుకొనే అవకాశాలున్నాయి.

ఇదీ చదవండి: బంగాల్ దంగల్: విజయానికి 'ఆమె' ఓట్లే కీలకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.