పాక్ గెలిచినందుకు భార్య ఖుష్.. పోలీసులకు భర్త ఫిర్యాదు - భారత్ పాకిస్థాన్ మ్యాచ్
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓటమిని అభిమానులను జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఆ సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ పాక్ గెలుపుపై సంబరాలు చేసుకుంది. విషయం తెలుసుకున్న భర్త ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

2021 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ఈ విషయాన్ని టీమ్ఇండియా అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ రామ్‌పుర్‌లో ఓ ఘటన వార్తల్లో నిలిచింది. పాకిస్థాన్‌కు మద్దతు తెలిపిన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడో వ్యక్తి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ జరిగింది..
గత నెల అక్టోబరు 24న భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్‌పై పాక్ విజయం సాధించింది. ఆ సమయంలో దిల్లీలో తన స్నేహితులతో కలిసి మ్యాచ్ చూసిన ఇషాన్ మియాన్ అనే వ్యక్తి మిగతా భారత అభిమానుల్లానే డీలా పడిపోయాడు. అదే సమయంలో తన వాట్సాప్ చూడగా.. అందులో పాక్ గెలుపును ఆనందిస్తున్నట్లు తన భార్య స్టేటస్ కనిపించింది.
దీంతో కోపం తెచ్చుకున్న ఇషాన్ మియాన్ రామ్‌పుర్ ఎస్పీని కలిసి ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. తన భార్యపై తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. భారత్‌పై ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసిందని ఆరోపించాడు.
రబియా స్టేటస్ ఆధారంగా పోలీసులు సెక్షన్ 153ఏ, 66 కింద కేసు నమోదు చేశారు. నిందితురాలిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి : 'భాజపా, ఆరెస్సెస్‌లతో జాగ్రత్త.. ఆ విషయంలో వెనకాడరు'