Delhi Rains: చెరువును తలపిస్తున్న దిల్లీ ఎయిర్పోర్ట్ - దిల్లీలో భారీ వర్షాలు
దిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో దిల్లీ విమానాశ్రయంలోకి వరదనీరు భారీగా వచ్చిచేరింది. 46 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతమని అధికారులు తెలిపారు. వర్షాలకు రోడ్లపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

దిల్లీ వాసులను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున మరోసారి కుండపోతగా వాన కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. 46ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతమని అధికారులు తెలిపారు. రహదారులు నదులను తలపిస్తున్నాయి. పలు చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


ఎయిర్‌పోర్ట్‌లోకి వరద..
వర్షం కారణంగా దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా వరదనీరు చేరింది. రన్‌వే, టర్మినల్ 3 ప్రాంతాల్లో నీరు నిలిచింది. ఏకధాటిగా కురిసిన వానకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు చోట్ల రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరింది.
నిలిచిపోయిన వాహనాలు..


అండర్‌పాస్ వంతెనల వద్ద నీరు నిలవడంతో ఆ మార్గాల్లో రాకపోకలు నిలిపివేశారు. వర్షం కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రానున్న 12 గంటల్లో దిల్లీ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాల కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. రాజధానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఇదీ చదవండి: Rainfall in India: లోటు వర్షపాతం.. ఆగస్టులో కురిసింది అంతంతే!