ETV Bharat / bharat

కొట్టేసిన కార్డులతో రూ.2 కోట్ల ఆన్​లైన్​ షాపింగ్​!

author img

By

Published : Mar 14, 2021, 3:28 PM IST

గుజరాత్​లో మరో హైటెక్​ మోసం బయటపడింది. అమెరికాకు చెందిన పలువురి డెబిట్​, క్రెడిట్ కార్డుల వివరాలతో రూ.2కోట్ల మోసాలకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. డార్క్​వెబ్​ సహకారంతో బాధితుల డేటాను అపహరించారు నిందితులు.

Three arrested  for Spending  2 Crore using stolen bank cards
రూ.2కోట్లు విలువచేసే 'హైటెక్'​ మోసం.. ముగ్గురు అరెస్టు

దొంగలించిన క్రెడిట్, డెబిట్​ కార్డుల వివరాలతో రూ.2 కోట్ల విలువైన ఆన్​లైన్​ కొనుగోళ్లు చేశారనే ఆరోపణలపై ముగ్గురిని అరెస్టు చేశారు గుజరాత్​ పోలీసులు. డార్క్​వెబ్​ ద్వారా అమెరికా, కెనడా పౌరుల డేటాను వారు సేకరించారని శనివారం తెలిపారు.

నిందితులను హర్ష్​వర్ధన్ పర్​మార్, కల్పేశ్ సింఘా, మోహిత్ లల్వానీగా పోలీసులు గుర్తించారు. వారు దొంగలించిన డేటాతో బంగారు నాణేలు, ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను తొలుత కొని, అనంతరం ఆన్​లైన్​లో వాటిని విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు.

"దొంగలించిన డేటాతో పర్​మార్ రూ.70 లక్షలు, సింఘా రూ.70లక్షలు, లల్వానీ రూ.60 లక్షల విలువైన కొనుగోళ్లు చేశారు. బాధితుల ఐడీ, పాస్​వర్డ్​లను డార్క్​వెబ్​ ద్వారా పాకిస్థాన్​కు చెందిన జియా ముస్తఫా, సద్దాం హెచ్​వీ నుంచి టెలీగ్రామ్​ మెసెంజర్​ సహకారంతో పర్​మార్​ సేకరించాడు. బదలుగా వారికి బిట్​కాయిన్లలో చెల్లించాడు. వాటిని మిగితా నిందితులతో పంచుకున్నాడు. ఆన్​లైన్​ కొనుగోళ్ల కోసం ఇతర రాష్ట్రాల్లో అసంపూర్ణ వ్యక్తిగత వివరాలతో సిమ్​కార్డులు తీసుకున్నారు."

-క్రైం బ్రాంచ్ అధికారి

నిందితులపై ఐపీసీ సహా పలు ఐటీ చట్టాల నిబంధనల మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇదీ చూడండి: రియల్​ ఎస్టేట్ కంపెనీలో మోసం.. రూ.56కోట్లు అటాచ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.