ETV Bharat / bharat

'ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదు' - ఉగ్రవాదం భారత్​

సీమాంతర ఉగ్రవాదం, జాత్యహంకారానికి ప్రస్తుత సమాజంలో చోటు లేదని భారత్​ స్పష్టం చేసింది. ఐరాసలో జరిగిన సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్​ తిరుమూర్తి ఈ మేరకు తెలిపారు.

discrimination
'ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదు'
author img

By

Published : Feb 19, 2021, 4:25 PM IST

నిర్దిష్ట వర్గాలే లక్ష్యంగా చెలరేగుతోన్న సీమాంతర ఉగ్రవాదం మైనారిటీలపై వివక్ష పెరగడానికి కారణమవుతుందని భారత్​ తెలిపింది. వారు మరింత పాతాళానికి పడిపోవడానికి ఇది దారితీస్తుందని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు, ఏజెన్సీలు ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని పిలుపునిచ్చింది.

"ఉగ్రవాదం.. మన సమాజంలో వివక్షకు ప్రధాన కారణంగా మారింది. నిర్దిష్ట వర్గాలపై పెరుగుతోన్న ఉగ్రవాద చర్యలు మైనారిటీలపై వివక్ష పెరగడానికి ప్రధాన కారణం. అయితే సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వానికి భారత్​ కట్టుబడి ఉంది."

- టీఎస్ తిరుమూర్తి, ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి

జాత్యహంకారం, జెనోఫోబియా, వివక్షను అంతమొందించడంపై జరిగిన ఎకోసాక్​ సమావేశంలో ఆయన ప్రసంగించారు.

ఇటువంటి ఉగ్రవాద చర్యలకు అన్ని దేశాలు దూరంగా ఉండాలని పిలుపునిచ్చింది భారత్. ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్థించరాదని సభ్య దేశాలు, ఐరాసను కోరింది.

ఈ సమావేశంలో ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​ మాట్లాడారు.

"జాత్యహంకారం ప్రపంచాన్ని పీడిస్తోంది. ఇది ప్రతిచోటా ఉంది. జాత్యహంకారాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి"

- ఆంటోనియో గుటెరస్, ఐరాస ప్రధాన కార్యదర్శి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.