ETV Bharat / bharat

కరోనా సాయంపై రాష్ట్రాలకు సుప్రీం కీలక ఆదేశాలు

author img

By

Published : May 28, 2021, 3:25 PM IST

కొవిడ్​ కారణంగా అనాథలైన పిల్లలను గుర్తించి వారికి తక్షణం సాయం అందేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది సుప్రీం కోర్టు. శనివారం సాయంత్రంలోగా వారి వివరాలను ఎన్​సీపీసీఆర్​ వెబ్​సైట్​లో అప్​లోడ్​ చేయాలని స్పష్టం చేసింది.

Supreme Court
సుప్రీం కోర్టు

కరోనా మహమ్మారి కారణంగా అనాథలుగా మారిన పిల్లలకు ఆసరాగా నిలవడంపై సుప్రీం కోర్టు రాష్ట్రాలకు కీలక ఆదేశాలిచ్చింది. అలాంటి చిన్నారులకు తక్షణమే సాయం అందించాలని సూచించింది.

కొవిడ్​ కారణంగా అనాథలైన పిల్లలను గుర్తించాలని జిల్లా పాలనాధికారులకు జిస్టిస్​ ఎల్​ఎన్​ రావు, జస్టిస్​ అనిరుద్ధ బోస్​తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. శనివారం సాయంత్రంలోగా వారి వివరాలను ఎన్​సీపీసీఆర్​ వెబ్​సైట్​లో పొందుపరచాలని స్పష్టం చేసింది.

అనాథలైన పిల్లలను గుర్తించి వారికి తక్షణం సాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలనివ్వాలని అమికస్​ క్యూరీ గౌరవ్​ అగర్వాల్​ కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన ధర్మాసనం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

ఇదీ చూడండి: Fact Check: ఉల్లిగడ్డపై నల్లని పొర వల్ల బ్లాక్​ ఫంగస్​ వస్తుందా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.