ETV Bharat / bharat

'టీకాల కొరత- పలు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్​ నిలిపివేత' - 50 లక్షల డోసులు అడిగిన విజయన్

పలు రాష్ట్రాల్లో కొవిడ్​ టీకాల కొరత ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్​లో టీకాలు లేని కారణంగా వ్యాక్సినేషన్​ ప్రక్రియ నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్​ రఘు శర్మ పేర్కొన్నారు. కేరళలోనూ టీకా డోసులు అయిపోతున్నాయని మరో 50 లక్షలు అధనంగా కావాలని కేంద్రానికి లేఖ రాశారు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్.

covid vaccine
'రాజస్థాన్​లో టీకాల కొరత-వ్యాక్సినేషన్​ ప్రక్రియ నిలిపివేత'
author img

By

Published : Apr 13, 2021, 8:53 AM IST

తమ రాష్ట్రంలో కొవిడ్ టీకాల కొరత ఉందని రాజస్థాన్ ఆరోగ్య మంత్రి డాక్టర్​ రఘు శర్మ తెలిపారు. కేంద్రం కేటాయించిన కోటి టీకా డోసులు వినియోగించినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం టీకాలు లేని కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.

రాజస్థాన్​లో కొవిడ్ కేసులు తీవ్రంగా పెరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంపై మౌనంగా ఉన్నారని శర్మ ఆరోపించారు. టీకాల కొరత ఉందని చెబుతున్న ప్రతిసారి.. కేంద్రం దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఏదో ఓ సాకు చెబుతోందన్నారు.

"రాజస్థాన్​లో వ్యాక్సినేషన్​ ప్రక్రియ పునఃప్రారంభించాలంటే కేంద్రం మరిన్ని వ్యాక్సిన్లు పంపిణీ చేయాలి. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడినవారే వ్యాక్సిన్లు తీసుకుంటున్నారు. కానీ, వైరస్ ఎక్కువగా 18 ఏళ్లు పైబడినవారికి సోకుతోంది. ఈ వయసు వారికీ వ్యాక్సిన్​ ఇవ్వడం అవసరం."

--డాక్టర్​ రఘు శర్మ, రాజస్థాన్ ఆరోగ్య మంత్రి

'50 లక్షల డోసులు కావాలి'

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తమ రాష్ట్రానికి మరో 50 లక్షల కొవిడ్​ టీకా డోసులు కావాలని కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం ఉన్న టీకాలు మరో మూడు రోజుల వరకు సరిపోతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​కు లేఖ రాశారు.

ఇదీ చదవండి: మహారాష్ట్రలో మరో 51వేల కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.