యూకేలోని కార్న్‌వాల్‌లో వచ్చే నెలలో జరగనున్న జీ-7 సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రత్యక్షంగా హాజరు కారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
"జీ-7 సదస్సుకు ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. భారత్‌లో కరోనా పరిస్థితుల దృష్ట్యా జీ-7 సదస్సుకు ప్రత్యక్షంగా హాజరు కావద్దని ప్రధాని మోదీ నిర్ణయించారు."
-- అరిందమ్ బాగ్చీ, విదేశాంగ శాఖ ప్రతినిధి
జీ-7 కూటమిలో యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా సభ్య దేశాలుగా ఉన్నాయి.
ఇదీ చదవండి : 'మీ అమ్మకు చెప్పు.. ఏదో ఒక రోజు సీఎం అవుతా'