NLC Graduate Trainee Posts 2023 : నవరత్న హోదా కలిగిన ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NLC) 295 గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (GET) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.
ఉద్యోగాల వివరాలు
- మెకానికల్ ఇంజినీర్ - 120 పోస్టులు
- ఎలక్ట్రికల్ ఇంజినీర్ - 109 పోస్టులు
- సివిల్ ఇంజినీర్ - 28 పోస్టులు
- మైనింగ్ ఇంజినీర్ - 17 పోస్టులు
- కంప్యూటర్ ఇంజినీర్ - 21 పోస్టులు
- మొత్తం పోస్టులు - 295
విద్యార్హతలు
NLC Graduate Executive Trainee Qualifications :
- మెకానికల్ : అభ్యర్థులు మెకానికల్ ఇంజినీరింగ్/ మెకానికల్ & ప్రొడక్షన్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి.
- సివిల్ : అభ్యర్థులు సివిల్ ఇంజినీరింగ్/ సివిల్ & స్ట్రక్చురల్ ఇంజినీరింగ్ క్వాలిఫై అయ్యుండాలి.
- కంప్యూటర్ : కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివి ఉండాలి.
- మైనింగ్ : మైనింగ్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
- ఎలక్ట్రికల్ : అభ్యర్థులు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ క్వాలిఫై అయ్యుండాలి.
వయోపరిమితి
NLC Graduate Executive Trainee Age Limit : ఆయా కేటగిరీలకు చెందిన అభ్యర్థుల వయస్సు 2023 నవంబర్ 1 నాటికి గరిష్ఠంగా ఎంత ఉండాలంటే..
- యూఆర్/ ఈడబ్ల్యూఎస్ - 30 ఏళ్లు
- ఓబీసీ - 33 ఏళ్లు
- ఎస్సీ - 35 ఏళ్లు
- ఎస్టీ - 35 ఏళ్లు
దరఖాస్తు రుసుము
NLC Graduate Executive Trainee Application Fee :
- యూఆర్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ (ఎన్సీఎల్) అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.854 చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ దరఖాస్తు రుసుముగా రూ.345 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం
NLC Graduate Executive Trainee Selection Process : గేట్-2023 స్కోర్ (80 మార్కులు), పర్సనల్ ఇంటర్వ్యూ (20 మార్కులు) ఆధారంగా అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు
NLC Graduate Executive Trainee Salary : గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు ఉంటుంది.
దరఖాస్తు విధానం
NLC Graduate Executive Trainee Application Process :
- అభ్యర్థులు ముందుగా NLC అధికారిక వెబ్సైట్ https://www.nlcindia.in ఓపెన్ చేయాలి.
- వెబ్సైట్లో మీ గేట్-2023 రిజిస్ట్రేషన్ నంబర్, మీ పేరు, ఫోన్ నంబర్, ఈ-మెయిల్లను ఎంటర్ చేసి, రిజిస్టర్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన పత్రాలు అన్నీ అప్లోడ్ చేయాలి.
- తరువాత అన్ని వివరాలు ఒకసారి చూసుకొని సబ్మిట్ చేయాలి.
నోట్ : రిజిస్ట్రేషన్ కమ్ అప్లికేషన్ ఫారమ్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. దీనితో పాటు సర్టిఫికెట్స్, ముఖ్యమైన పత్రాలను సెల్ఫ్-అటాస్ట్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో వీటిని ఇవ్వాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
NLC Graduate Executive Trainee Apply Last Date :
- దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 నవంబర్ 22
- దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 డిసెంబర్ 21
PGCILలో 203 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు - అప్లై చేసుకోండిలా!
డిగ్రీ అర్హతతో ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 ACIO పోస్టులు - అప్లై చేసుకోండిలా!