ETV Bharat / bharat

'ఆరోగ్య సూచీ'లో కేరళ టాప్​- తెలంగాణ థర్డ్, ఏపీ ఫోర్త్ - నీతి ఆయోగ్​ ఆరోగ్య సూచీ

Niti aayog health index 2021: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించటంలో మరోమారు అగ్రస్థానంలో నిలిచింది కేరళ. ఆ తర్వాత తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులు సాధించాయి. ఉత్తర్​ప్రదేశ్​ చివరి స్థానంలో నిలిచినట్లు నీతి ఆయోగ్​ ఆరోగ్య సూచీ వెల్లడించింది.

niti aayog health index 2021
నీతి ఆయోగ్​
author img

By

Published : Dec 27, 2021, 1:39 PM IST

Updated : Dec 27, 2021, 3:15 PM IST

Niti aayog health index 2021: ఆరోగ్య విభాగం పనితీరులో కేరళ వరుసగా నాలుగోసారి అగ్రస్థానంలో నిలిచింది. 2019-20 ఏడాదికిగాను నీతి ఆయోగ్​ విడుదల చేసిన నాలుగో ఆరోగ్య సూచీలో పెద్ద రాష్ట్రాల జాబితాలో కేరళ మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ భాగస్వామ్యంతో, ప్రపంచ బ్యాంకు సాంకేతిక సాయంతో వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించింది నీతి ఆయోగ్​.

తెలంగాణ మూడు, ఏపీ నాలుగో ర్యాంక్​

ఈ జాబితాలో తమిళనాడు రెండోస్థానంలో నిలవగా.. తెలంగాణ మూడు, ఆంధ్రప్రదేశ్​ నాలుగో ర్యాంకు దక్కించుకున్నాయి. అయితే, ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచిన ఉత్తర్​ప్రదేశ్​ మరో విషయంలో మాత్రం అగ్రస్థానాన్ని ఆక్రమించుకోవటం విశేషం. 2018-19తో పోలిస్తే 2019-20 ఏడాదిలో ఉత్తర్​ప్రదేశ్​ ఆరోగ్య ప్రమాణాల్లో గణనీయమైన మార్పు చోటు చేసుకున్నట్లు నివేదిక పేర్కొంది.

మరోవైపు.. తొలి రెండు స్థానాలను ఆక్రమించిన కేరళ, తమిళనాడు.. ఇంక్రిమెంటల్​ మార్పు విషయంలో వరుసగా 12, 8వ ర్యాంకులకు పరిమితమయ్యాయి. ఓవరాల్​ పనితీరు, ఇంక్రిమెంటల్​ మార్పులో రెండింటిలోనూ తెలంగాణ మూడో ర్యాంకును సాధించింది. రెండు విభాగాల పరంగా చూస్తే రాజస్థాన్​ వెనకబడిపోయింది.

చిన్న రాష్ట్రాల్లో..

చిన్న రాష్ట్రాల్లో మిజోరాం మంచి పనితీరుతో తొలిస్థానంలో నిలిచింది. త్రిపుర రెండో స్థానంలో, సిక్కిం మూడో స్థానంలో ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాద్రానగర్​ హవేలీ, దీవ్​-దమణ్​ అగ్రస్థానంలో ఉండగా.. దిల్లీ ఐదు, జమ్ముకశ్మీర్ ఆరో స్థానంలో నిలిచాయి. అయితే.. ఈ రెండు ప్రాంతాలు ఇంక్రిమెంటల్ మార్పులో అగ్రస్థానాన్ని సాధించటం గమనార్హం.

ఇదీ చూడండి: 15-18 ఏళ్ల వారికి టీకా- జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్​

Last Updated : Dec 27, 2021, 3:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.