కరోనా రెండో దశలో ఊపిరితిత్తులను వైరస్ వేగంగా దెబ్బతీస్తోందని వైద్యులు తెలిపారు. కేవలం 7 రోజుల్లోనే ఊపిరితిత్తులకు 50-70 శాతం నష్టాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు ఛండీగఢ్ పీజీఐ ఆస్పత్రి పల్మనాలజిస్ట్ ఎస్కే జిందాల్. కొవిడ్ మొదటి దశలో ఈ సమయం 14 రోజులుగా ఉండేదని స్పష్టం చేశారు. ఈ కారణంగానే రెండో దశలో ఎక్కువ కరోనా మరణాలు సంభవిస్తున్నాయని వివరించారు.
20 ఏళ్ల పాటు రోజుకు 2-3 సిగరెట్లు తాగడం వల్ల ఊపిరితిత్తులకు కలిగేంత నష్టం.. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా 2, 3 రోజుల్లోనే వాటిల్లుతోందని వివరించారు జిందాల్.
ఇదీ చదవండి: ఆక్సిజన్ కొరతతో ఐదుగురు మృతి!
ఇదీ చదవండి: రెండోసారి కొవిడ్‌ను జయించిన యడియూరప్ప