ETV Bharat / bharat

బంధనంలో భారత్- ఏ రాష్ట్రంలో పరిస్థితి ఎలా? - లాక్​డౌన్​ రాష్ట్రాలు

దేశంలో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైరస్​ వ్యాప్తి కట్టడికి వివిధ రాష్ట్రాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. ఉత్తర్​ప్రదేశ్​, దిల్లీ, హరియాణాలో లాక్​డౌన్​ను మే 17 పొడిగించారు. తమిళనాడు, రాజస్థాన్​, పుదుచ్చేరిలో సోమవారం నుంచి లాక్​డౌన్​ ప్రారంభం కానుంది. ఇంకా ఏయే రాష్ట్రాల్లో ఎలాంటి ఆంక్షలు అమల్లో ఉన్నాయంటే..

corona lockdown
రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు
author img

By

Published : May 10, 2021, 7:16 AM IST

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వివిధ రాష్ట్రాలు యథాశక్తి కఠిన చర్యలు చేపడుతున్నాయి. లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలతో పాటు అనేక ఆంక్షలు విధించాయి.

లాక్‌డౌన్‌లు ఎక్కడెక్కడ?

  • దిల్లీలో ఇప్పటికే అమలవుతున్న లాక్‌డౌన్‌ను ఈ నెల 17 వరకు పొడిగించారు. మెట్రో రైలు సేవలను కూడా రద్దు చేశారు.
  • తమిళనాడు, రాజస్థాన్‌, పుదుచ్చేరిల్లో సోమవారం నుంచి రెండు వారాల పాటు అమలు చేస్తారు.
  • హరియాణాలో ఈనెల 17 వరకు పొడిగించారు. ఇంతకుముందు 9 జిల్లాల్లో వారంతపు కర్ఫ్యూను అమలు చేశారు.
  • కేరళలో 9 రోజులు (శనివారం నుంచి), మిజోరమ్‌లో 7 రోజుల (సోమవారం నుంచి) పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.
  • బిహార్‌లో ఈ నెల 15 వరకూ కొనసాగుతుంది.
  • ఒడిశాలో 14 రోజుల లాక్‌డౌన్‌ ఈనెల 19 వరకు అమల్లో ఉంటుంది.
  • నాగాలాండ్‌లో కఠిన నిబంధనలతో పాక్షికంగా ఈనెల 14 వరకు అమలు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఏమిటీ ముంబయి మోడల్‌.. కరోనా వేళ ఏం చేసింది?

వారాంతాల్లో..

  • చండీగఢ్‌లో వారాంతపు లాక్‌డౌన్‌లు కొనసాగుతున్నాయి.
  • ఛత్తీస్‌గఢ్‌లోనూ వారాంతపు లాక్‌డౌన్‌ విధించారు. స్థానికంగా అమలు చేసే లాక్‌డౌన్‌లను ఈనెల 15 వరకు పొడిగించుకోవచ్చని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
  • పంజాబ్‌లో ఈనెల 15 వరకు వారాంతపు లాక్‌డౌన్‌, రాత్రి కర్ఫ్యూలతో పాటు కఠిన నిబంధనలు విధించారు.

లాక్‌డౌన్‌ తరహా..

  • మహారాష్ట్రలో ఏప్రిల్‌ 5న ప్రారంభించిన నిబంధనలను ఈనెల 15 వరకు పొడిగించారు.
  • ఉత్తర్‌ప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ తరహా కఠిన నిబంధనలతో కూడిన కరోనా కర్ఫ్యూని ఈనెల 17 వరకు పొడిగించారు.
  • ఝార్ఖండ్‌లో ఈనెల 13 వరకు పొడిగించారు.
  • కర్ణాటకలో ఈనెల 24 వరకు అమలు చేస్తున్నారు. సిక్కింలో ఈనెల 16 వరకు ఆంక్షలు విధించారు.
  • జమ్మూ-కశ్మీర్‌ అధికార యంత్రాంగం ఈనెల 10 వరకు నిబంధనలను అమలు చేస్తోంది.

ఇదీ చూడండి: భారత్​కు 12 రోజుల్లో 6,738 ఆక్సిజన్​ సిలిండర్లు

కర్ఫ్యూలు..

  • గోవా ప్రభుత్వం ఈనెల 9 నుంచి 24 వరకు కర్ఫ్యూ అమలు చేస్తోంది.
  • మధ్యప్రదేశ్‌లో ఈనెల 15 వరకు జనతా కర్ఫ్యూ విధించారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తున్నారు.
  • గుజరాత్‌లో రాత్రివేళ కర్ఫ్యూ అమల్లో ఉండగా పగటిపూట ఆంక్షలు 36 నగరాల్లో ఈనెల 12 వరకు అమలు చేస్తున్నారు.
  • అస్సాంలో కర్ఫ్యూ రాత్రి 8 నుంచి అమలు చేస్తుండగా ఇకపై సాయంత్రం 6 గంటల నుంచే విధిస్తున్నారు.
  • అరుణాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం సాయంత్రం 6.30 నుంచి ఉదయం 5 వరకు రాత్రి ఈ నెల మొత్తం అమలు చేస్తోంది.
  • మణిపుర్‌లోని 7 జిల్లాల్లో ఈనెల 8 నుంచి 17 వరకు కర్ఫ్యూ.
  • ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ సహా పలు నిబంధనలను తిరిగి విధించింది.హిమాచల్‌ప్రదేశ్‌ ఈనెల 7 నుంచి 16 వరకు లాక్‌డౌన్‌ లేదా కరోనా కర్ఫ్యూ పేరిట నిబంధనలు విధించింది.
  • బంగాల్​లో గత వారం నుంచి కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి: 'నిధుల కేటాయింపుల్లో ఆరోగ్య రంగంపై నిర్లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.