ETV Bharat / bharat

మద్యం అమ్మకాలపై కమల్ కీలక హామీ

తమిళనాడులో తాము అధికారంలో వస్తే మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తామని ఎంఎన్​ఎం పార్టీ అధినేత కమల్​హాసన్ అన్నారు. అందుకు బదులు ఉచితంగా తాగునీరు సరఫరా చేస్తామని పేర్కొన్నారు. మధురై ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"Liquor sales will be privatized" - actor turned politician Kamal Haasan
'మద్యం విక్రయాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తాం'
author img

By

Published : Dec 14, 2020, 5:39 PM IST

ఎన్నికల్లో గెలవడానికి ఓటుకు నోట్లు ఇచ్చే రాజకీయ పార్టీలపై విరుచుకుపడ్డారు మక్కల్​ నీది మయ్యం పార్టీ అధినేత కమల్​ హాసన్​. హామీలు నిజాయితీగా ఉండాలన్నారు. కనీస అవసరాలు తీర్చుకోలేని వ్యక్తులకు రూ.5 వేలు చేతిలో పెడితే తీసుకుంటున్నారని.. ఆ ధోరణి మారాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. తమిళనాడులో అవినీతిని నిర్మూలించాల్సిన సమయం వచ్చిందన్న కమల్​.. అది ఒక్కరి వల్ల సాధ్యం కాదని, అందుకు ప్రజల సాయం కావాలని మధురై ప్రచార సభలో అన్నారు.

"తగిన ప్రణాళికలు లేకుండా ఏ రంగంలోకీ అడుగుపెట్టను. ప్రభుత్వమే ప్రజల కనీస అవసరాలు తీర్చేలా అన్ని ఏర్పాట్లు చేయాలి. ప్రజలు రాజకీయలను తమ చేతుల్లోకి తీసుకోవాలి" అని కమల్​ పేర్కొన్నారు.

మద్యం గురించి మాట్లాడిన కమల్​.. 'ఐఎస్​ఎస్​ అధికారుల మద్యం తయారు చేసి విక్రయించడం చూస్తున్నాం. మేం అధికారంలోకి వస్తే మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తాం. దానికి బదులు ఉచితంగా తాగునీటి సరఫరా చేస్తాం' అని ప్రజలకు హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: ఈ నెల 13 నుంచి కమల్​ ఎన్నికల ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.