ETV Bharat / bharat

kappa Mutations: దేశంలో కొవిడ్‌ విజృంభణకు కారణం అవే! - ఇన్సాకాగ్‌ తాజా వార్తలు

Kappa Mutations: కప్పా వేరియంట్‌ ప్రభావంతోనే గతేడాది డిసెంబర్‌లో పలుచోట్ల కొవిడ్‌ విజృంభించిందని జీనోమిక్స్‌ కన్సార్టియం(ఇన్సాకాగ్‌) వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 95 వేలకుపైగా నమూనాలను విశ్లేషించగా.. లక్షా 18వేల కొవిడ్‌ నమూనాలకు సీక్వెన్సింగ్‌ చేసినట్లు ఇన్సాకోగ్‌ వెల్లడించింది.

kappa mutations
కప్పా మ్యుటెషన్స్
author img

By

Published : Dec 1, 2021, 6:50 AM IST

Kappa Mutations: దేశంలో ఈ ఏడాది ఆరంభంలో కరోనా వైరస్‌ విజృంభించడానికి కప్పా వేరియంట్‌లో చోటుచేసుకున్న మ్యుటేషన్లే కారణమని ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం(ఇన్సాకాగ్​) వెల్లడించింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వైరస్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ మహారాష్ట్రలో పెరగడానికి ఇవే కారణమని పేర్కొంది.

ఇక ఒమిక్రాన్‌ ప్రభావం ఇప్పటివరకు మన దేశంలో లేదన్న ఇన్సాకోగ్‌.. ప్రస్తుతం డెల్టా వేరియంట్‌ ప్రాబల్యమే దేశంలో అధికంగా ఉందని తాజా బులిటెన్‌లో వెల్లడించింది. అయితే, ఈ వేరియంట్‌ను ఎదుర్కోవడంలో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలు సమర్థంగా పనిచేసినట్లు ఇప్పటికే నిరూపితమైన విషయాన్ని జీనోమిక్స్‌ కన్సార్టియం గుర్తుచేసింది.

గతేడాది డిసెంబర్‌లో వెలుగుచూసిన కప్పా వేరియంట్‌ ప్రభావంతో పలుచోట్ల కొవిడ్‌ విజృంభణ కొనసాగింది. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ 'వేరియంట్‌ అండర్‌ మానిటరింగ్‌'గా ప్రకటించింది. ఈ వేరియంట్‌ కేసులు మహారాష్ట్రతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, కేరళ రాష్ట్రాల్లోనూ బయటపడ్డాయి. ప్రస్తుతం మాత్రం దాదాపు అన్ని రాష్ట్రాల్లో కొవిడ్‌ తీవ్రత అదుపులోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా వైరస్‌ ప్రాబల్యం, కొత్త వేరియంట్ల ప్రభావాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (ఇన్సాకాగ్) ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 95 వేలకుపైగా నమూనాలను విశ్లేషించగా.. లక్షా 18వేల కొవిడ్‌ నమూనాలకు సీక్వెన్సింగ్‌ చేసినట్లు ఇన్సాకోగ్‌ వెల్లడించింది.

ఇదీ చూడండి: 'ఆరు నెలల్లో అందుబాటులోకి చిన్నారుల టీకా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.