రాజస్థాన్లోని పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద చొరబాటు యత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి. పాకిస్థాన్ నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు యత్నించిన చొరబాటుదారుడిని భారత సైన్యం కాల్చి చంపింది. ఈ ఘటన శనివారం రాత్రి.. శ్రీ గంగానగర్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతంలో జరిగిందని అధికారులు తెలిపారు.
"భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించిన చొరబాటుదారున్ని బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారు. లొంగిపోమని పలుమార్లు హెచ్చరించినా వినకపోవడం వల్ల భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు" అని ఓ అధికారి వెల్లడించారు.
అయితే.. అతని వద్ద ఎలాంటి ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభించలేదని తెలిపారు.
ఇదీ చూడండి: 'మంత్రికి 100 కోట్లు' లేఖ వ్యవహారంలో కొత్త ట్విస్ట్