ETV Bharat / bharat

భారత్​లో 4 కోట్ల మైలురాయి దాటిన వ్యాక్సినేషన్​

కరోనా మహమ్మారి పోరులో భాగంగా టీకా పంపిణీలో భారత్​ సరికొత్త మైలురాయిని చేరుకుంది. శుక్రవారం సాయంత్రం నాటికి 4.11 కోట్లకు పైగా టీకా డోసులను అందించినట్లు కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది.

vaccination in india
భారత్​లో 4 కోట్ల మైలురాయి దాటిన వ్యాక్సినేషన్​
author img

By

Published : Mar 19, 2021, 10:35 PM IST

Updated : Mar 19, 2021, 10:53 PM IST

దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సరికొత్త తీరాలకు చేరింది. శుక్రవారం సాయంత్రం నాటికి దేశంలో 4.11 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

వ్యాక్సినేషన్​ లెక్కల్లో..

  • దేశంలో శుక్రవారం సాయంత్రం 7 గంటల నాటికి మొత్తం 4,11,55,978 టీకా డోసులు పంపిణీ చేశారు.
  • శుక్రవారం ఒక్కరోజే 18,16,161 మంది లబ్ధిదారులకు టీకా అందించారు.
  • 76,86,920 మంది ఆరోగ్య సిబ్బంది కరోనా టీకా మొదటి డోసు తీసుకోగా.. 47,69,469 మంది కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు.
  • 79,10,529 మంది కరోనా యోధులు(ఫ్రంట్​లైన్​ వర్కర్స్​) కరోనా టీకా మొదటి డోసు తీసుకోగా.. 23,16,922 మంది కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు.
  • 60 ఏళ్లకు పైబడిన 1,53,78,622 మందికి కరోనా వ్యాక్సిన్​ మొదటి డోసు అందించారు.
  • 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉండి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడే వారిలో 30,93,516 మందికి వ్యాక్సిన్​ మొదటి డోసు పంపిణీ చేశారు.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ జనవరి 16న ప్రారంభమైంది. తొలుత వైద్య సిబ్బందికి టీకా అందించారు. మార్చి 1 నుంచి.. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, 45 ఏళ్లు పైబడిన దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారికి వ్యాక్సిన్ ఇస్తున్నారు.

కాగా దేశంలో రోజువారి కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే దాదాపు 39వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

ముంబయిలో రికార్డు కేసులు..

మహారాష్ట్రలోని ముంబయిలో శుక్రవారం 3,062 మందికి వైరస్​ సోకింది. ఈ కేసులతో కలిపి బృహన్​ ముంబయి మున్సిపల్​ కార్పొరేషన్​(బీఎంసీ) పరిధిలో వైరస్​ సోకిన వారి సంఖ్య 3,55,897కు చేరింది. మొత్తం 11,565 మంది.. వైరస్​ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

దిల్లీలో కేసులు..

దిల్లీలో శుక్రవారం కొత్తగా 716 మందికి వైరస్​ సోకింది. ఈ కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 6,46,348కి చేరింది. తాజాగా మరో నలుగురు మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 10,953కు చేరింది.

మధ్యప్రదేశ్​లో లాక్​డౌన్..​

మధ్యప్రదేశ్​లో ఈ నెల 21 ఆదివారం రోజున మూడు నగరాల్లో లాక్‌డౌన్‌ విధించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నిర్ణయించారు. రాష్ట్రంలోని పలు నగరాల్లో పెద్ద సంఖ్యలో కేసులు వెలుగుచూస్తుండగా అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం రాష్ట్రంలోని ఇండోర్‌, భోపాల్‌, జబల్‌పూర్‌ నగరాల్లో ఒక్కరోజు లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించారు. అలాగే, ఈ నెల 31 వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయనున్నారు.

మరోవైపు, మధ్యప్రదేశ్‌లో గత 24గంటల్లో 1,140 కేసులు, ఏడు మరణాలు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,73,097కి చేరింది.

ఇవీ చూడండి:

Last Updated : Mar 19, 2021, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.