ETV Bharat / bharat

'బ్లాక్​ఫంగస్​తో అంత మందిలో అంధత్వం' - తమిళనాడు

మ్యూకర్​మైకోసిస్(mucormycosis) సోకినవారిలో చాలా మంది చూపుకోల్పోతున్నారు. ఇటీవల తమిళనాడులో ఈ వ్యాధితో ఆస్పత్రిలో చేరినవారిలో 30 మంది అంధత్వం బారినపడినట్లు వైద్యులు తెలిపారు.

BLACK FUNGUS
బ్లాక్​ఫంగస్
author img

By

Published : Jul 4, 2021, 9:56 PM IST

బ్లాక్​ఫంగస్(black fungus)​ వ్యాధి కంటిచూపును కబళిస్తోంది. తమిళనాడు కోయంబత్తూర్​లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన 264 మంది మ్యూకర్​మైకోసిస్(mucormycosis)​ రోగుల్లో 30 మంది ఒక కంటిలో చూపు కోల్పోయినట్లు (vision loss) ఓ అధికారి వెల్లడించారు.

రోగులందరికీ ఎండోస్కోపీ జరిగిందని, వారిలో 110 మంది కళ్లకు శస్త్రచికిత్స చేసినట్లు ఆస్పత్రి డీన్ డా.ఎన్​. నిర్మల ఆదివారం తెలిపారు. అయితే బ్లాక్​ ఫంగస్​(black fungus) సోకిన ప్రారంభ దశలోనే ఆస్పత్రిలో చేరినవారికి వ్యాధి పూర్తిగా నయమైందని వెల్లడించారు.

ఈ లక్షణాలుంటే జాగ్రత్త..

కళ్లు, మొహంలో రక్తం లేదా వాపు, కళ్లు ఎర్రబారడం, పంటి నొప్పి లాంటివాటితో పాటు ముక్కులో లేదా కఫం సమస్యలుంటే నిర్లక్ష్యం చేయరాదని ఆరోగ్య శాఖ అవగాహన కల్పిస్తోంది. ఈ లక్షణాలున్నవారు వైద్యుడిని సంప్రదించడంలో ఆలస్యం చేయరాదని డీన్ హెచ్చరిస్తున్నారు.

ఇవీ చూడండి:

కరోనా బాధితులకు బ్లాక్ ఫంగస్​తో అంధత్వం!

Black fungus: ఆలస్యంగా గుర్తిస్తే.. అంధకారమే.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.