ETV Bharat / bharat

How to Register on AFD Canteen Stores Department (CSD) : ఆర్మీ క్యాంటీన్ పోర్టల్​లో.. ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసా..?

How to Register AFD CSD Online Portal : సాయుధ బలగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఆన్​లైన్​లో వస్తువులను కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పోర్టల్ లో ఏవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇకపై అంత కష్టపడాల్సిన పనిలేదు. చాలా సింపుల్​గా ఆన్​లైన్​లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

CSD Online Portal
AFD CSD
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 2:06 PM IST

How to Register AFD CSD Online Portal : భారత ప్రభుత్వం సాయుధ బలగాల్లో పనిచేసే వారికి వస్తువులను కొనుగోలు చేసుకోవడానికి ఆర్మీ క్యాంటీన్లు ఏర్పాటు చేసిన విషయం మనందరికి తెలిసిన విషయమే. వీటిని క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్(సీఎస్​డీ) అని కూడా పిలుస్తారు. బయటి మార్కెట్​తో పోలిస్తే ఈ క్యాంటీన్లో జవాన్లకు(Jawans) ఏఎఫ్​డీ వస్తువులు చౌక ధరలకు లభిస్తాయి. కొవిడ్-19 కారణంగా సాయుధ బలగాల్లో పనిచేసే వారికి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం సీఎస్డీ క్యాంటీన్లలో లభించేవన్నీ ఆన్లైన్లో లభించేలా http://afd.csdindia.gov.in అనే ప్రత్యేక పోర్టల్​ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

AFD CSD Canteen Registration Process : ఈ పోర్టల్ ద్వారా సుమారు 45 లక్షల మంది ఆర్మీ సిబ్బంది ఏఎప్‌డీ–1 కేటగిరీలోని వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేసే వెసులుబాటును కల్పిస్తోంది. దీంతో.. ఆర్మీ(Indian Army) సిబ్బంది బయటకు రాకుండానే విధుల్లోని విరామం సమయంలో ఈ వస్తువులను కొనుగోలు చేసేందుకు వీలు ఉంటుంది. అయితే.. ప్రస్తుతం విధుల్లో ఉన్నవారికే కాక ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు కూడా ఇది వర్తింస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇంతకీ జవాన్లు ఈ పోర్టల్​లో ఏ విధంగా లాగిన్ అయి రిజిస్ట్రేషన్ కావాలి? ఏయే పత్రాలు అవసరం? ఎవరెవరు అర్హులు? ఏయే వస్తువులు అందులో దొరుకుతాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Required Documents for CSD AFD Registration :

CSD AFD ఆన్​లైన్ పోర్టల్ రిజిస్ట్రేషన్ సమయంలో కావాల్సిన పత్రాలు

  • క్యాంటీన్ కార్డు
  • పాన్ కార్డ్
  • మొబైల్ నంబర్
  • ఈమెయిల్ ఐడీ
  • డిశ్చార్జీ నంబర్/పీపీఓ

ఆర్మీలో స్పెషల్ కొలువులు.. NCC సర్టిఫికెట్ ఉంటే జాబ్ పక్కా! జీతం రూ.56వేల పైనే

ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..

How to Register AFD CSD Canteen Online Portal :

  • మొదట ఏదైనా బ్రౌజర్‌ని తెరిచి.. CSD క్యాంటీన్‌లోని అధికారిక వెబ్‌సైట్‌ afd.csdindia.gov.inకి వెళ్లాలి.
  • ఆ తర్వాత మీరు afd.csdindia.gov.in shop now అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు మీకు లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది.
  • కిందికి స్క్రోల్ చేసి మీరు కొత్తగా రిజిస్టర్ చేసుకుంటున్నారు కాబట్టి Not Yet aMember? Register New అనే దానిపై క్లిక్ చేయాలి.
  • అనంతరం మీరు New User Registrationపై క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ ఫాం ఓపెన్ అవుతుంది.
  • అలా.. మీ వివరాలను ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీరు రిజిస్టర్ అవ్వొచ్చు.
  • ఆ తర్వాత ఈ పోర్టల్లో మీకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
  • ఆన్‌లైన్లో afd.csdindia.gov.in పోర్టల్ నుంచి afd csd వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత మీరు క్రెడిట్/డెబిట్ కార్డ్, UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.

అయితే ఈ క్యాంటీన్ కార్డ్ హోల్డర్‌లు Signup అభ్యర్థనను నింపేటప్పుడు, ఫారమ్‌లను చెక్ అవుట్ చేస్తున్నప్పుడు సర్వీస్ నంబర్/ ర్యాంక్ వంటి సేవా వివరాలను ఉపయోగించవద్దనే విషయం గుర్తుంచుకోవాలి. సేవా వివరాలను ఉపయోగించినట్లయితే మీ లాగిన్/AFD డిమాండ్ రిజెక్ట్/క్యాన్సిల్ అవుతుంది.

ఆన్​లైన్​లో ఏయే వస్తువులు పొందవచ్చంటే.. దేశంలో దాదాపు 3,700 ఆర్మీ క్యాంటీన్లు ఉన్నాయి. ఈ ఆన్లైన్ AFD CSD పోర్టల్లో రిజిస్టర్ అవ్వడం ద్వారా మీరు వాషింగ్‌ మెషీన్లు, మైక్రో ఓవెన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండీషన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు వంటివి ఏఎఫ్‌డీ-1 కేటగిరీ కిందకు వస్తాయి. అలాగే ఈ కేటగిరీ కిందకు వచ్చే ఎయిర్‌ప్యూరిఫైయర్లు, హోం థియేటర్లు, మొబైల్‌ ఫోన్స్‌, తదితర వస్తువులన్నీ ఆన్‌లైన్‌ ద్వారా జవాన్లు కొనుగోలు చేయొచ్చు.

Indian Army jobs : ఇంజినీర్లకు గుడ్​న్యూస్​.. బీటెక్​తో ఇండియన్​ ఆర్మీలో జాబ్స్​!

జవాన్ల కోసం 3డీ ప్రింటెడ్ ఇళ్లు.. భూకంపం వచ్చినా సేఫ్.. 'ఆత్మనిర్భర్​ భారత్'​లో భాగంగా..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.