ETV Bharat / bharat

గోద్రా అల్లర్ల కేసు దోషికి జీవిత ఖైదు

Godhra riots 2002: గోద్రా అల్లర్ల కేసులో రఫిక్​ భతుక్​కు జీవిత ఖైదు విధించింది ప్రత్యేక సెషన్స్​ కోర్టు. ఈ కేసులో 35వ నిందితుడిగా ఉన్న అతడిని దోషిగా ఇటీవల తేల్చింది కోర్టు.

godhra riots 2002
godhra riots 2002
author img

By

Published : Jul 3, 2022, 7:32 PM IST

Godhra riots 2002: గుజరాత్​లోని గోద్రాలో 2002లో జరిగిన రైలు దహనం కేసులో ప్రత్యేక సిట్​ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో 35వ నిందితుడిగా ఉన్న రఫిక్​ భతుక్​ను దోషిగా తేల్చింది కోర్టు. చారిత్రక గోద్రా అల్లర్ల కేసులో భతుక్​కు జీవిత ఖైదు విధించినట్లు స్పెషల్​ ప్రొసిక్యూటర్​ ఆర్​సీ కొడెకర్​ తెలిపారు. గోద్రా అల్లర్ల అనంతరం దేశంలోని వివిధ నగరాల్లో భతుక్​ తిరుగుతుండగా.. గతేడాది ఫిబ్రవరిలో భతుక్​ను పట్టుకున్నారు పంచ్​మహల్ స్పెషల్​ ఆపరేషన్​ పోలీసులు.

అంతకుముందు గోద్రా అల్లర్ల కేసులో 2011 మార్చి 1న ప్రత్యేక కోర్టు 31 మందిని దోషులుగా తేల్చింది. అనంతరం 11 మందికి మరణశిక్ష, మరో 20 మందికి జీవిత ఖైదు విధించింది. 11 మందికి విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ 2017అక్టోబర్​లో గుజరాత్​ హైకోర్టు తీర్పునిచ్చింది. గతేడాది ఆగస్టులో ఫరూఖ్​ భనా, ఇమ్రాన్ షెరీకి జీవిత ఖైదు విధిస్తూ సిట్​ కోర్టు తీర్పునిచ్చింది. మరో ముగ్గురిని నిర్ధోషులుగా విడుదల చేసింది. ఈ కేసుకు సంబంధించి మరో ఎనిమిది మంది నిందితులు పరారీలో ఉన్నారు.

ఇదీ కేసు..: 2002, ఫిబ్రవరి 27న గోద్రాలో కరసేవకులు ప్రయాణిస్తున్న సబర్మతి ఎక్స్​ప్రెస్​లోని ఎస్​6 బోగీని దహనం చేశారు. ఈ ఘటనలో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. గోద్రా రైలు దహనంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. గుజరాత్​వ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో సుమారు 1000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా.

ఇదీ చదవండి: దటీజ్ ఆర్మీ... 4గంటల్లోనే బ్రిడ్జి నిర్మాణం.. అమర్​నాథ్ యాత్రికులకు రిలీఫ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.