ETV Bharat / bharat

సౌదీ జనరల్​తో భారత ఆర్మీ చీఫ్ భేటీ

author img

By

Published : Dec 14, 2020, 3:11 PM IST

గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవాణే ఆదివారం సౌదీ కమాండర్ జనరల్ బిన్ అబ్దుల్లా మహమ్మద్ అల్ ముతీర్​తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భారత్​-సౌదీ మధ్య రక్షణ బంధం బలోపేతం సహా పలు కీలక అంశాలపై చర్చించారు.

Gen. Naravane meets with Saudi Army generals
సౌదీ జనరల్​ స్థాయి అధికారులతో భారత ఆర్మీ చీఫ్​ సమావేశం

భారత ఆర్మీ చీఫ్​ జనరల్ ఎం.ఎం.నరవాణే సౌదీ జనరల్​ స్థాయి అధికారులతో ఆదివారం సమావేశమయ్యారు. గల్ఫ్ దేశాల చారిత్రక పర్యటన సందర్భంగా.. ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాల బలోపేతం చేయడం సహా ఇరు దేశాల ప్రయోజనాలపై సౌదీ కమాండర్​ జనరల్ బిన్ అబ్దుల్లా మహమ్మద్ అల్ ముతీర్​తో చర్చించారు. ఈ భేటీలో సౌదీ జనరల్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

గల్ఫ్​ దేశాల్లో వ్యూహాత్మకంగా కీలకమైన యునైటెట్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), సౌదీ అరేబీయాలో పర్యటించిన భారత ఆర్మీ చీఫ్ అధికారి జనరల్ నరవాణేనే కావడం గమనార్హం.

తొలుత యూఏఈలో పర్యటించిన జనరల్ నరవాణే.. ఆ దేశ మేజర్ జనరల్ సలేహ్​ మహమ్మద్ సలేహ్​ అల్ అమేరీతో రక్షణ సహకారం సహా పలు ఇతర అంశాలపై చర్చించారు.

ఇదీ చూడండి:ఐఐటీ మద్రాస్​ కార్యకలాపాలు బంద్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.