తమిళనాడు చెన్నైలోని వాండలూర్ జూలో సింహాలకు డెల్టా వేరియంట్ రకం కరోనా సోకినట్లు జూ అధికారులు తెలిపారు. జూలోని సింహాల నుంచి సేకరించిన నమూనాలను భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (నిషాద్) ప్రయోగశాలలో పరీక్షించారు. ఫలితాలను విశ్లేషించిన అనంతరం ఈ అంశం వెల్లడైనట్లు జూ అధికారులు తెలిపారు.
వాటిలో మొత్తం నాలుగు సీక్వెన్సులు పాంగోలిన్ వంశం బి.1.617.2కు చెందినవని.. వీటిని డబ్ల్యూహెచ్ఓ 'డెల్టా వేరియంట్'గా గుర్తించిందని జూ అధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు.
మే 24న పదకొండు సింహాలు, మే 24న నాలుగు, మే 29న ఏడు సింహాల నమూనాలను భోపాలోని నిషాద్కు జూ సిబ్బంది పంపారు. జూన్ 3న ఫలితాలు రాగా.. 9 సింహాలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయిందని.. వాటికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: ఆ జూపార్కులో కరోనాకు మరో మృగరాజు బలి