'ఐదేళ్లు...' ఎవరైనా ఈ వయసులో ఇంటి దగ్గరే ఉంటూ ఆడుకుంటారు. లేదా అమ్మ కొంగు చాటున దాక్కొని మారాం చేస్తుంటారు. కానీ మహారాష్ట్రకు చెందిన ఈ చిన్నారి అలా కాదు. ఐదేళ్లకే సాహసాలకు సై అనేసింది. మలంగ్గఢ్ అనే పర్వతాన్ని (Trekking in Maharashtra) ఎక్కేసింది. అతిపిన్న వయసులో ఈ కొండను అధిరోహించిన వ్యక్తిగా చరిత్ర లిఖించింది.

నాశిక్‌కు చెందిన ఈ బుల్లి పర్వతారోహకురాలి పేరు అర్ణా ఇప్పర్. చిన్నపిల్ల పర్వతారోహణ చేసిందంటే అదేదో సాదాసీదా పర్వతం అనుకుంటే పొరపాటే. ఆ కొండ ఎత్తు (Malanggad Trek) ఏకంగా 3,200 అడుగులు. పర్వతం పైకి (Malanggad news) చేరుకోవడంలో భాగంగా.. ట్రెక్కింగ్, పోల్ క్రాసింగ్ వంటి సాహసాలూ చేసిందీ చిన్నారి. నిపుణులైన పర్వతారోహకులకు దీటుగా ట్రెక్కింగ్‌లో పాల్గొంది. అర్ణాకు ఇది మూడో ట్రెక్కింగ్ కావటం మరో విశేషం.


ఉరిమే ఉత్సాహంతో..
పర్వతాన్ని ఎక్కే సమయంలో అర్ణ ఎప్పుడూ అలసటకు గురికాలేదని చిన్నారి తండ్రి కిశోర్ ఇప్పర్ చెబుతున్నారు. అందరితో కలిసి ట్రెక్కింగ్ ఉల్లాసంగా ట్రెక్కింగ్ చేసేదని అంటున్నారు. ఇంత చిన్న వయసులో ధైర్యంగా ట్రెక్కింగ్ చేసిన చిన్నారి సాహసాన్ని అనేక మంది మెచ్చుకుంటున్నారు. భవిష్యత్‌లో అర్ణ మరిన్ని రికార్డులు బద్దలు కొడుతుందని ధీమాగా చెబుతున్నారు.

ఇదీ చదవండి: మహిళా పోలీసు సాహసం.. వరద బాధితుడిని భుజాలపై మోసుకెళ్లి..