ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య.. అదే కారణమా? - అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య
కేరళలో విషాద ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక కష్టాలే వీరి ఆత్మహత్యలకు కారణమా? లేకే వేరే ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేరళ, తిరువనంతపురం సమీపంలోని కల్లంబలంలో శనివారం ఈ విషాద ఘటన వెలుగుచూసింది. ఇంటి యజమాని మణికుట్టన్, అతని భార్య సంధ్య, ఆయన కుమార్తె అమేయ, కుమారుడు అజిష్, సంధ్య పిన్ని దేవకిని మృతులుగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: మణికుట్టన్ ఇంట్లో ఉరివేసుకుని కనిపించగా, మిగిలిన నలుగురు సభ్యులు నేలపై పడి ఉన్నారు. మిగతావారు విషం తీసుకుని మరణించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మణికుట్టన్కు ఆర్థిక సమస్యలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. అప్పుల బాధ వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
మణికుట్టన్కు చతన్‌పరాలో తినుబండారాల దుకాణం ఉంది. రెండు రోజుల క్రితం ఆ దుకాణాన్ని మూసివేయాలని పంచాయతీ అధికారులు ఆదేశించారు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైన అతడు కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద కేసు కింద నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శనివారం ఉదయం వారి బంధువు.. బాధితుల ఇంటికి వెళ్లడం వల్ల ఈ విషాద వార్త బయటకు వచ్చిందని తెలిపారు.
ఇవీ చదవండి: సరిహద్దు దాటి భారత్‌లోకి మూడేళ్ల బాలుడు.. జవాన్లు ఏం చేశారంటే?
స్పైస్‌జెట్ విమానంలో పొగలు.. 5వేల అడుగుల ఎత్తులో.. కానీ లక్కీగా..