Fire accident in train: ఉత్తర్‌ప్రదేశ్ ఫరుఖాబాద్ జిల్లాలో కాసగంజ్ ప్యాసింజర్ రైలు జనరల్ బోగీలో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. రైల్వే సిబ్బంది, ప్రయాణికుల సాయంతో బోగీని వేరు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశాయి అగ్నిమాపక దళాలు.
జిల్లాలోని హరసింహాపుర్ గోవా హాల్ట్ సమీపంలో జనరల్ బోగీ ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. హథియాపుర్ రైల్వే క్రాసింగ్ వద్ద ట్రైన్‌ను నిలిపివేశారు. రైల్వే గార్డ్స్, ప్రయాణికులు బోగీని రైలు నుంచి వేరు చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక విభాగం.. హుటాహుటిన రెండు వాహనాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, బోగీ దగ్ధమైన క్రమంలో నష్టంపై అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
"ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే రెండు అగ్నమాపక యంత్రాలు 12.35 గంటలకు చేరుకున్నాయి. 1.15 గంటల ప్రాంతంలో మంటలు అదుపులోకి వచ్చాయి. పొగ అలుముకున్న నేపథ్యంలో లోపలికి వెళ్లలేని పరిస్థితి. అందులోకి వెళ్లిన తర్వాతే ఎవరైనా ఉన్నారా? అని తెలుస్తుంది. మంటల వ్యాప్తి నేపథ్యంలో పలువురు ప్రయాణికులు రైలు నుంచి దూకటం వల్ల గాయపడ్డారు."- వీరేంద్ర కుమార్, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్
సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు ఉన్నతాధికారులు. దగ్ధమైన బోగి స్థానంలో 9 అదనపు బోగీలను అమర్చి రైలును పంపించారు.
నిలిపి ఉంచిన రైలులో మంటలు
Train fire accident in Bihar: బిహార్‌లోని గయా రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫామ్‌పై నిలిపి ఉంచిన రైలు స్లీపర్ క్లాస్ బోగీలో మంటలు అంటుకున్నాయి. దీంతో రైల్వే స్టేషన్లో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. సమాచారం అందిన వెంటనే పలు అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రమాదానికి గల కారణాలను తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: బ్రేకులు ఫెయిలై రెండు రైళ్లు ఢీ- దూకేసిన డ్రైవర్లు!