fire accident in Rajendranagar Shastripuram: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటలు చల్లారకమునుపే.. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ శాస్త్రీపురంలో మరో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న తుక్కు గోదాములో ప్రమాదం చోటుచేసుకోవడంతో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. గోదాములో అధిక మొత్తంలో ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఉదయం 7గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 15 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో తుక్కు కోసం వినియోగించే 2 డీసీఎం వాహనాలు దగ్ధం కాగా.. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రాథమికంగా భావిస్తున్నారు.
fire accident in scrap warehouse: ప్రమాదం హైదరాబాద్ పాతబస్తీ మిర్ అలం ఫిల్టర్ సమీపంలో చోటుచేసుకోగా.. ప్రమావాదం వల్ల పక్కనే ఉన్న తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వారిని ఉన్న సమీపంలో ఉన్న ఫంక్షన్ హాల్‌కు తరలించారు. ఈ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష జరగాల్సి ఉన్నప్పటికీ.. అగ్నిప్రమాదం సంభవించడంతో కొద్దిసేపు విద్యార్థులను లోపలికి అనుమతించలేదు. ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టత రావడంతో విద్యార్థులను పరీక్ష రాసేందుకు అనుమితించారు.
Swapnalok complex fire accident: గురువారం రాత్రి సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం ఎంత విషాదం నింపిందో తెలిసిందే.. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టంతో పాటు ఆరుగురు మృతి చెందారు. మృతి చెందిన వారికి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబీకులకు రూ. 5లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని.. మంత్రులు అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను, వారి కుటుంబాలను.. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ స్వయంగా వెళ్లి పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం తరుపున అన్నివిధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.స్వప్నలోక్ భవనంలో అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణమని భావిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి భావిస్తున్నారు.
భవనంలో అగ్నిప్రమాద పరికరాలు పెట్టినా.. ఏమాత్రం పని చేయలేదని ఆయన వివరించారు. దట్టమైన పొగ వల్లే కాల్‌సెంటర్‌లోని యువత ఊపిరాడక మృతిచెందినట్లు వివరించారు. మరోవైపు అగ్నిప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురిలో ఒక్కొక్కరికీ రూ. 2లక్షలను పరిహారంగా ప్రధాని మోదీ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి రూ.50వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి:
స్వప్నలోక్ మృతుల కుటుంబాలకు.. రాష్ట్రప్రభుత్వం బాసట
తెలంగాణకు గుడ్ న్యూస్.. 'మెగా టెక్స్టైల్ పార్క్' ప్రకటించిన మోదీ
హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు