ETV Bharat / bharat

Doctors Removed Child Nose : శిశువుకు జ్వరం, ముక్కు నుంచి నీరు కారుతుందని ఆసుపత్రికి తీసుకెళ్తే.. ముక్కునే తొలగించారు - తెలంగాణ వార్తలు

Fernandez Doctors Removed Baby Nose : పది రోజుల శిశువుకి జ్వరంతో పాటు ముక్కు నుంచి నీరు కారుతుందని ఆసుపత్రికి వెళితె ఏకంగా ముక్కునే తొలంగించిన ఘటన హైదరాబాద్​లోని ఫెర్నాండెజ్‌ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. దీనిపై వైద్యులని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించాలంటూ బాధిత తల్లిదండ్రులు వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీస్​ స్టేషన్​ ముందు ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

nose
nose
author img

By

Published : Jul 8, 2023, 11:44 AM IST

Doctors Removed 10days Baby Nose : పుట్టిన శిశువుకు చిన్నపాటి ఇన్ఫెక్షన్స్ ఉండడం సాధారణం. దానికి చికిత్స చేస్తారు. ఇన్ఫెక్షన్​ కాస్త సీరియస్​ అవుతే అడ్మిట్​ చేసుకుని చికిత్సచేసి వారు పూర్తిగా కొలుకున్నాక డిశ్ఛార్జ్​ చేస్తారు. ఈ ప్రక్రియ ప్రతి ఆసుపత్రిలో ఒకేలాగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం పది రోజుల శిశువుకి జ్వరం వచ్చి ముక్కులో నుంచి నీరు కారుతుందని ఆసుపత్రికి వచ్చారు. దానికి వైద్యులు ఏకంగా ముక్కే లేకుండా చేశారు. ఇంతకి అక్కడ జరిగింది అంటే...

Fernandez Doctors Removed Baby Nose : పాతబస్తీ కాలాపత్తర్​కు చెందిన ఇమ్రాన్​ఖాన్​, హర్షన్నుస్సా ఖాన్​ దంపతులకు పెళ్లై 13 సంవత్సరాలు. ఇన్నేళ్ల నిరీక్షణ తరువాత వారికి జూన్‌ 8న హైదర్‌గూడలోని ఫెర్నండెజ్‌ ఆసుపత్రిలో మగబిడ్డ పుట్టాడు. ఆ శిశువుకి ఫతేఖాన్​ అని పేరు పెట్టారు. బాబు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని డాక్టర్లు అదేరోజు ఎన్​ఐసీయూకి తీసుకువెళ్లారు. పది రోజుల తర్వాత బిడ్డను తల్లిదండ్రులకు చూపించారు. వారు బాలుడి ముక్కు నల్లబడినట్లు గుర్తించారు. ఇదే విషయంపై వైద్యులను ప్రశ్నించగా ఆక్సిజన్​ పెట్టడంతో ఇన్ఫెక్షన్​ సోకిందని చెప్పారు. దానికి పైగా రూ.18వేల విలువైన ఆయింట్మెంట్​ తెప్పించారు.

ఇటీవల మరోసారి బిడ్డను తల్లిదండ్రులకు చూపించగా నల్లగా మారిన భాగం ఊడిపోయి ఉండడంతో వారు ఒక్కసారిగా షాక్​ అయ్యారు. ఏంటని వైద్యులని నిలదీయగా... వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తండ్రి వాపోయారు. ఆసుపత్రిలో ఫీజు రోజుకి రూ.10 వేలు చొప్పున వసూలు చేశారు. ఇప్పటివరకు అప్పు చేసి రూ.5 లక్షలు బిల్లు చెల్లించామని ఆవేదన వ్యక్తం చేశారు. బిడ్డకు జ్వరం వచ్చి ముక్కులో నుంచి నీరు కారుతుంటే ఆసుపత్రికి తీసుకువచ్చాం అన్నారు. అప్పుడు వైద్య సిబ్బంది చిన్న స్టిక్​కు దూది పెట్టి శుభ్రం చేయడం చూస్తుంటే కన్నీళ్లు ఆగలేవని అన్నారు. దీనంతటికి కారణం ఇక్కడి డా. సాయికిరణ్, ఆయన వైద్య బృందమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై స్పందిచిన ఆసుపత్రి వర్గాలు... ఏడాది తర్వాత ముక్కును సరిచేసే ప్రయత్నం చేస్తామన్నారు. పూర్తి స్థాయిలో ప్లాస్టిక్​ సర్జరీ చేయాలంటే 10 సంవత్సరాల తర్వాత వీలవుతుందని వైద్యులు పేర్కొన్నారు.

తమకు న్యాయం చేయాలంటూ బాలుని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పది రోజుల శిశువు ముక్కుకు ఇన్ఫెక్షన్​ సోకిందని ఆసుపత్రికి వెళితే ముక్కే లేకుండా చేశారని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. ముక్కు తిసేసిన బిడ్డను అలానే డిశ్ఛార్జి చేస్తామని చెప్పడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం నారాయణ గూడ పోలీస్​ స్టేషన్​ ముందు ఆందోళనకు దిగారు. దాంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తరువాత పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

శిశువుకు జ్వరం, ముక్కు నుంచి నీరు కారుతుందని ఆసుపత్రికి తీసుకెళ్తే.. ముక్కునే తొలగించారు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.