ETV Bharat / bharat

డ్రోన్లతో టీకాల సరఫరా- 15 నిమిషాల్లో 26 కి.మీ ప్రయాణించి... - కరోనా వ్యాక్సిన్​ పంపిణీ తాజా

ఈశాన్య రాష్ట్రాల్లో డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్​ (Vaccine Drone Delivery) పంపిణీ ప్రారంభమైంది. ఇందులో భాగంగా మణిపుర్​లోని విష్ణుపుర్​ జిల్లా ఆసుపత్రి నుంచి కరాంగ్​ అనే ప్రాంతానికి డ్రోన్​ సాయంతో టీకాలను అందించారు.

vaccine supply drones
ఈశాన్య రాష్ట్రాల్లో డ్రోన్ల సాయంతో టీకాల సరఫరా
author img

By

Published : Oct 4, 2021, 5:52 PM IST

Updated : Oct 4, 2021, 7:16 PM IST

మణిపుర్​లోని విష్ణుపుర్​ జిల్లా ఆసుపత్రి వద్ద ప్రారంభమైన కార్యక్రమం

దేశంలోని మారుమూల ప్రాంతాలకు టీకాలు వేగంగా చేరవేయడమే లక్ష్యంగా కేంద్రం డ్రోన్ల (Vaccine Drone Delivery) వినియోగానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈశాన్య రాష్ట్రాల్లో డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్ల పంపిణీని ప్రారంభించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్​ మాండవీయ.

ఐసీఎంఆర్​ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మణిపుర్​లోని విష్ణుపుర్​ జిల్లా ఆసుపత్రి నుంచి లోక్​తక్​ సరస్సు వద్ద ఉన్న కరాంగ్​కు డ్రోన్​ సాయంతో (Vaccine Drone Delivery) టీకాలు పంపించారు.

"మేకిన్ ఇండియా డ్రోన్​తో 15 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతానికి టీకాను అందించడం దక్షిణాసియాలో ఇదే తొలిసారి. విష్ణుపుర్​ ఆసుపత్రి నుంచి లోక్​తక్​ సరస్సు సమీపంలోని కరాంగ్​ ప్రాంతానికి డ్రోన్​ చేరేందుకు 12-15 నిమిషాలు పట్టింది. ఇదే రోడ్డు మార్గం అయితే ఈ రెండు ప్రాంతాల మధ్య 26 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ డ్రోన్​ ద్వారా సరఫరా చేసిన టీకాలతో ఈ రోజు 18 మంది లబ్ధిపొందుతారు."

-మన్​సుఖ్​ మాండవీయ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

డ్రోన్లను అత్యవసర సేవలకు వినియోగించుకోవచ్చని.. వైద్య రంగంలో ఈ డ్రోన్లు గేమ్​ ఛేంజర్లుగా మారనున్నాయని మాండవీయ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం మణిపుర్​, నాగాలాండ్​ సహా అండమాన్​, నికోబార్​ దీవులలో డ్రోన్ల ద్వారా టీకా పంపిణీకి కేంద్రం అనుమతిచ్చింది. ఈ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా టీకా సరఫరా కోసం ఐసీఎంఆర్​.. ఐఐటీ కాన్పుర్​తో కలిసి పరిశోధన చేసింది.

ఇదీ చూడండి : 'కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేలు ఇవ్వాల్సిందే'

Last Updated : Oct 4, 2021, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.