Covid Cases India: దేశంలో రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 1,581 మందికి వైరస్ సోకింది. మరో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,741 మంది వైరస్‌ను జయించారు.
- మొత్తం కేసులు: 4,30,10,971
- మొత్తం మరణాలు: 5,16,543
- యాక్టివ్ కేసులు: 23,913
- కోలుకున్నవారు: 4,24,70,515
Vaccination in India
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతోంది. సోమవారం మరో 30,58,879 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,81,56,01,944కు పెరిగింది.
Covid Tests:
దేశంలో సోమవారం 5,68,471 కరోనా టెస్టులు నిర్వహించారు.
ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందంటే..
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనాసాగుతోంది. అయితే ఆదివారంతో పోల్చితే సోమవారం కేసుల సంఖ్య తగ్గింది. అన్ని దేశాల్లో కలిపి మరో 10,93,465 కొత్త కేసులు వెలుగుచూశాయి. 3,427 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 47,26,16,904కు చేరగా.. మృతుల సంఖ్య 61,05,565కు పెరిగింది.
కరోనా ప్రభావం దక్షిణ కొరియాలో కాస్త తగ్గింది. అక్కడ 2,09,169 కొత్త కేసులు వెలుగుచూశాయి. మరో 329 మరణాలు నమోదయ్యాయి.
కరోనా ప్రభావం అధికంగా ఉన్న దేశాలు
దేశం | కొత్త కేసులు | కొత్త మరణాలు | మొత్తం కేసులు | మొత్తం మరణాలు | |
1 | దక్షిణ కొరియా | 2,09,169 | 329 | 95,82,815 | 12,757 |
2 | వియత్నాం | 1,31,713 | 69 | 80,89,761 | 41,949 |
3 | జర్మనీ | 1,82,939 | 109 | 1,88,66,226 | 1,27,541 |
4 | ఫ్రాన్స్ | 24,179 | 152 | 2,41,61,339 | 1,41,085 |
5 | ఇటలీ | 32,573 | 119 | 1,38,95,188 | 1,57,904 |
ఇదీ చదవండి: ఆ వేరియంట్‌తో మరోసారి కొవిడ్ విజృంభణ.. ఫౌచీ హెచ్చరిక