ETV Bharat / bharat

దేశంలో తగ్గని కొవిడ్ ఉద్ధృతి.. 30వేలు దాటిన యాక్టివ్ కేసులు - అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో రివ్యూ మీటింగ్

దేశంలో కొవిడ్​ ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 6,155 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహమ్మారి వల్ల మరో 11 మంది మరణించారని పేర్కొంది.

covid cases in india
covid cases in india
author img

By

Published : Apr 8, 2023, 11:05 AM IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,155 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ సోకడం వల్ల ఒక్క రోజులోనే 11 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారంతో పోలిస్తే 105 కేసులు పెరిగాయి. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య కూడా 31,194 పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

  • దేశంలో కొత్తగా 6,155 కరోనా కేసులు నమోదయ్యాయి.
  • కొవిడ్ వైరస్ వల్ల మరో 11 మరణించారు.
  • ఇప్పటి వరకు కొవిడ్​తో మరణించిన వారి సంఖ్య 5,30,954కు చేరింది.
  • దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 31,194కు చేరింది.
  • కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 4,47,51,259 మందికి కొవిడ్​ సోకింది.
  • ఇప్పటి వరకు 4,41,89,111 మంది రికవరీ అయ్యారు. రికవరీ రేట్​ 98.74 శాతంగా ఉంది.
  • ఇప్పటివరకు 220.66(220,66,22,663) కోట్ల కొవిడ్​ టీకాలు పంపిణీ చేశారు.
  • శుక్రవారం ఒక్కరోజే 1,09,378 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేశారు.

చిన్నారుల కళ్లలో దురదలు..
కొవిడ్‌ బారిన పడుతున్న పిల్లల్లో కళ్లు దురదగా ఉండడం, పుసులు కట్టడం వంటి లక్షణాలు ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. గతంలో కరోనా బాధితుల్లో ఈ పరిస్థితి కనిపించలేదని తెలిపారు. కాబట్టి కొత్త వేరియంట్‌ వల్లే కళ్లలో పుసులు, దురద వస్తుండొచ్చని అభిప్రాయపడ్డారు. వీటికి అదనంగా గతంలో ఉన్నట్లే అధిక జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఇప్పుడూ కరోనా బాధితుల్లో కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

కొవిడ్ సమీక్ష..
దేశంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న వేళ.. ప్రజారోగ్య సన్నద్ధతపై శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. కొవిడ్ టీకా కార్యక్రమ ప్రగతిని, ప్రజారోగ్య సన్నద్ధతను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్‌ కేసులు పెరిగిన వేళ కేంద్రం, రాష్ట్రాలు సహకార స్ఫూర్తితో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

కరోనా టెస్టులను పెంచాలని, ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ సూచించారు. ఏప్రిల్‌ 10, 11వ తేదీల్లో మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించాలన్నారు. వాటిని సమీక్షించేందుకు రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు ఆస్పత్రులకు వెళ్లాలని తెలిపారు. ఎమర్జెన్సీ హాట్‌స్పాట్లను గుర్తించాలని కోరారు. కొవిడ్‌ పరీక్షలు, టీకాలు వేయడం పెంచాలని, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేవో చూసుకోవాలని మన్‌సుఖ్‌ మాండవీయ రాష్ట్రాలకు సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.