ఆధ్యాత్మికవేత్త, బౌద్ధమత గురువైన దలైలామాకు దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' ఇచ్చి గౌరవించాలని కేంద్రాన్ని కోరారు హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శాంత కుమార్. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.
టిబెట్‌లో జరిగిన ఊచకోత ఈ శతాబ్దంలోనే అత్యంత విషాదకరమైనదని శాంత అభిప్రాయపడ్డారు. దీనిపై ఐక్యరాజ్య సమితిలో చర్చించాలని కోరారు. 1950లో చైనా టిబెట్‌ను ఆక్రమించుకునే సమయంలో కాంగ్రెస్ నోరు మెదపలేదని విమర్శించారు. ఫలితంగానే చైనా ప్రపంచానికే కొరకరాని కొయ్యగా మారిందని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు శాంత. అయితే ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందన్నారు.