ETV Bharat / bharat

CM KCR Resigned : ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా - గవర్నర్ తమిళిసై ఆమోదం - గవర్నర్ తమిళి సై సౌందర రాజన్​ను కలిసిన కేసీఆర్

CM KCR Resigned : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్‌కు రాజీనామా లేఖ పంపారు.

KCR
KCR
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 4:46 PM IST

Updated : Dec 3, 2023, 7:20 PM IST

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

CM KCR Resigned 2023 : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తన జోరు సాగించింది. ఇప్పటి వరకు 64 స్థానాలను కైవసం చేసుకుంది. తెలంగాణలో ప్రజల నాడిని తెలుసుకోవడంలో ఆ పార్టీ వంద శాతం విజయం సాధించింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఇచ్చిన హామీలు, కేసీఆర్ భరోసా ఏవీ ఆ పార్టీని గెలుపు తీరాలకు చేర్పించలేకపోయాయి. మరోవైపు ఆరు గ్యారెంటీలు, అభయహస్తం మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాయి. కర్ణాటక ఫలితాలను తెలంగాణలో రిపీట్ చేసి తీరతామని మొదటి నుంచీ చెబుతున్న కాంగ్రెస్ తన పంతం నెగ్గించుకుంది. చేయి జోరుకు కారుకు బ్రేక్ పడింది.

KCR Resignation TO CM Post : ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఆయన రాజ్‌భవన్‌లో ఉన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు తన రాజీనామా లేఖను పంపారు కేసీఆర్ విజ్ఞప్తి మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం సాయంత్రం ఐదున్నరకు గవర్నర్ సమయం తీసుకున్నారు. ఆ సమయం కంటె ముందే సీఎంఓ నుంచి కేసీఆర్ రాజీనామా లేఖ రాజ్ భవన్‌కు చేరింది. స్పెషల్ మెసెంజర్ ద్వారా రాజీనామా లేఖను రాజ్ భవన్‌కు పంపారు. గవర్నర్ తమిళిసై కేసీఆర్ రాజీనామాను ఆమోదించారు.

Telangana Assembly Election Results 2023 : అంతకు కాసేపు ముందే కేసీఆర్ ఎలాంటి కాన్వాయ్ లేకుండా వ్యక్తిగత వాహనాల్లో ప్రగతిభవన్ నుంచి ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రానికి వెళ్లిపోయారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమైన రోజే రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. 2018 అక్టోబర్ ఆరో తేదీన శాసనసభ రద్దు చేయడంతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఎన్నికల్లో గులాబీ పార్టీ ఘనవిజయంతో 2018 డిసెంబర్ 13వ తేదీన కేసీఆర్ రెండోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవడంతో కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. తొమ్మిదిన్నరేళ్ల పాటు కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగారు.

మరోవైపు ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీలోకి దిగారు. అయితే గజ్వేల్‌లో కేసీఆర్ ఈసారి కూడా విజయఢంకా మోగించారు. కేసీఆర్ 2014, 2018లో గజ్వేల్‌ నుంచి పోటీ చేసిన కేసీఆర్ ఆ రెండు సార్లు విజయకేతనం ఎగరవేశారు. ఇక అప్పటి నుంచి సీఎంగా కొనసాగిన ఆయన తన సొంతనియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సాగించారు. గజ్వేల్ ప్రగతికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆ అభివృద్ధిని చూసిన గజ్వేల్ ప్రజలు ఈసారి కూడా కేసీఆర్‌కే పట్టం కట్టారు. మరోవైపు కామారెడ్డిలో మాత్రం కేసీఆర్ ఓటమిపాలయ్యారు. బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట్రమణారెడ్డి చేతిలో ఓడిపోయారు.

ఎంపీ మళ్లీ బీజేపీదే- పేద మహిళల అండ, మామా-మోదీ కరిష్మాతో ఘన విజయం

Revanth Reddy, Telangana Election Result 2023 Live : 'ప్రగతిభవన్ పేరును అంబేడ్కర్ ప్రజా భవన్​గా మారుస్తాం'

Last Updated : Dec 3, 2023, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.