ETV Bharat / bharat

శాంతియుతంగానే 'చక్కాజామ్'​: రాకేశ్ టికాయిత్

ఫిబ్రవరి 6న రైతులు తలపెట్టిన చక్కాజామ్(రాస్తారోకో) కార్యక్రమం శాంతియుతంగానే సాగుతుందని బీకేయూ, రైతు సంఘం నేత రాకేశ్​ టికాయిత్​ స్పష్టం చేశారు. దిల్లీ మినహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

Chakka jam
'చక్కాజామ్'​ శాంతియతంగానే నిర్వహిస్తాం: రాకేశ్​ టికాయిత్​
author img

By

Published : Feb 5, 2021, 5:56 PM IST

నూతన సాగు చట్టాల రద్దు కోసం ఉద్యమిస్తోన్న రైతులు.. ఫిబ్రవరి 6(శనివారం)న చక్కాజామ్​(రాస్తారోకో) కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగానే నిర్వహిస్తామని భారతీయ కిసాన్​ యూనియన్​(బీకేయూ) ప్రతినిధి రాకేశ్​ టికాయిత్​ తెలిపారు. దిల్లీలో ఈ కార్యక్రమం ఉండబోదని స్పష్టం చేశారు.

"మేం ఎప్పుడూ శాంతియుతంగానే పోరాడుతున్నాం. ఫిబ్రవరి 6 నాటి రాస్తారోకో కార్యక్రమం కూడా శాంతియుతంగానే కొనసాగుతుంది. ఇక్కడకు వచ్చి కార్యక్రమంలో పాల్గొనలేని రైతులు తమతమ ప్రాంతాల్లో రాస్తారోకో నిర్వహించాలి."

-- రాకేశ్​ టికాయిత్​, బీకేయూ నేత

గాజీపుర్​ సరిహద్దులో పోరాడుతున్న రైతులకు ఆహారం, నీళ్లు అందతున్నాయని టికాయిత్​ పేర్కొన్నారు. శాంతియుత వాతావరణంలో ప్రభుత్వంతో చర్చలు జరిపి తమ వాదనను వినిపిస్తామని తెలిపారు. తాము పంటలను పండిస్తుంటే ప్రభుత్వం మేకులను మొలిపిస్తోందని విమర్శించారు. దిల్లీ మినహా అన్ని ప్రాంతాల్లో ఫిబ్రవరి 6న నాలుగు గంటలపాటు రాస్తారోకో కార్యక్రమం ఉంటుందని టికాయిత్..​ అంతకుముందు తెలిపారు.

భద్రత కట్టుదిట్టం..

జనవరి 26న జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో... శనివారం నాటి 'చక్కా జామ్​ కార్యక్రమం కోసం పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయమై ఉన్నత అధికారులతో దిల్లీ పోలీస్​ కమిషనర్​ అలోక్​ వర్మ భేటీ అయ్యారు. సీనియర్​ పోలీస్​ అధికారులు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా రంగంలోకి దిగి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారని సమాచారం.

విరమించండి..

రాస్తారోకో కార్యక్రమాన్ని విరమించుకోవాలని హరియాణా ఆరోగ్య మంత్రి అనిల్​ విజ్​.. రైతులను కోరారు. చర్చలతోనే ప్రపంచ సమస్యలు ఎన్నో పరిష్కారమయ్యాయని అన్నారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ నిరసన వ్యక్తం చేసే హక్కు ఇచ్చినప్పటికీ.. ఇతరుల హక్కులకు భంగం వాటిల్లకూడదని సూచించారు. రైతులతో ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని, అందుకే.. రాస్తారోకోను వదిలి చర్చలకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:సభాముఖంగా సాగు చట్టాలపై మోదీ ప్రసంగం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.